ఒక సీఎం.... జనం మధ్య దీపావళి అంటే ఇదేనేమో!
posted on Oct 21, 2025 10:14AM
.webp)
ఎప్పుడూ జెడ్ కేటగిరి భద్రత లో ఉండే ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కసారిగా జనం మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందంటే.. జస్ట్ దీపావళి నడిచి.. వచ్చినట్టే ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఊహించనవి విధంగా.. బాబు తమ దగ్గరకి రావడంతో ఒక్కొక్కరి కళ్లలో ఆనందం దీపావళి మతాబుల్లో వెలిగిపోయి కనిపించాయి.
దసరా తొలి రోజు నుంచి దీపావళి వరకూ జీఎస్టీ తగ్గుదల మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా.. చంద్రబాబు వితౌట్ సెక్యూరిటీతో మార్కెట్ లో కలయదిరిగారు. చంద్రబాబు. బాబు తమను పలకరించడంతో ఒక్కొక్కరూ పులకరించిపోయారనే చెప్పాలి. ఒక సమయంలో జై బాబు జై బాబు అంటూ కొందరు నినదించడం కనిపించింది.
తన మనవడు దేవాన్ష్ కోసం టపాకాయలు కొన్న చంద్రబాబు.. ఆపై ఒక సీజనల్ వ్యాపారితో జీఎస్టీ గురించి కాసేపు ముచ్చటించారు. ఆపై చాలా మందితో సెఫ్లీలకు పోజులిచ్చారు. అటు పిమ్మట తన కారు ఎక్కి ఆయన వెళ్లిపోయిన దృశ్యం కనిపించింది.
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. హంగామాలు లేవు. జనం పోగేయటం వంటి కృత్రిమ విన్యాసాలు లేవు. అక్కడ జనం ఎంత మంది ఉన్నారో అందరితోనే మాటా మంతి కలిపారు. ఆపై వారి వారి వివరాలు అడిగి తెలుసుకుని.. వారికి నిజమైన దీవాళీ మజా ఏంటో రుచి చూపించారు.
బాబు సార్ జనం ముఖ్యమంత్రి అంతే అంటూ ఎవరికి వారు ఉప్పొంగిపోయారనే చెప్పాలి. ఎంతైనా ప్రజల వద్దకే పాలన పరిచయం చేసిన సీఎం కదా.. ప్రజల వద్దకే జీఎస్టీ అవగాహన తీసుకురాలేరా? అన్న మాట కూడా వినిపించింది.