సినిమానే త‌ల‌పిస్తుంది.. వీరి క‌ల‌యిక‌!

బాల్యంలోనే విడిపోయి పెద్ద‌యిన తర్వాత క‌లుసుకునే అన్నాచెల్లెళ్ల‌ను సినిమాలు బాగా చూపించి ఇలానూ జ‌రుగుతుందా అని పించారు ప్రేక్ష‌కు ల‌చేత‌. కొన్ని ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు అలానే జ‌రుగుతాయ‌న్న‌ది ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉంటాయి. త‌ప్పిపోయిన పిల్ల‌లు క‌ల‌వ‌డం ఈమ‌ధ్య‌కాలంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ జ‌రిగింది. త‌న‌కు ఒక అన్న ఉన్నాడ‌ని తెలిసి అత‌న్ని క‌ల‌వడాని కి ఏకంగా ప‌దేళ్ల‌పాటు తెలిసిన అన్ని ప్రాంతాలు, ఆస్ప‌త్రులూ తిరిగిండి క్రిస్టినా సాడ్‌బెరీ. ఆస్టిన్ టెక్సాస్‌లో కుక్ హాస్పిట‌ల్ అని పిల్ల‌ల ఆస్ప‌త్రి ఉంది. అక్క‌డ‌కి ఏడేళ్లుగా రోజూ వెళ్లి అన్ని వార్డులు త‌ర‌చి చూసేది. ఆమెను ఎవ్వ‌రూ అడ్డుకునే వారు కాదు. కార‌ణం ఆమె అక్క‌డే పుట్టింది. మూడేళ్ల వ‌య‌సులో క్రిస్టినా తన అస‌లు కుటుంబానికీ దూర‌మ‌యింది. అన్నా.. నువ్వులేని నా బ‌తుకు భారం.. అంటూ వీధుల ప‌డి సినిమాటిక్‌గా ఏడ‌వ‌లేదు. ఎలాగైనా క‌లివాల‌ని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్న‌ది ఆమె ప‌ట్టుద‌ల‌. 

చిత్ర‌మేమంటే క్రిస్టినా సోద‌రుడు రేమండ్ ట‌ర్న‌ర్ కూడా ఇలానే అదే ఆస్ప‌త్రిలో తిర‌గ‌డం! అప‌రిచితుల్లా ఇద్ద‌రూ అక్క‌డే తిరిగా రు. 2006 నుంచి త‌న అస‌లు కుటుంబం గురించి తిరుగుతూంటే ఆమెకు త‌న త‌ల్లి క‌లిసిందికాని తండ్రి , సోదరుడూ ఎవ‌ర‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు.  చివ‌రికి 2014లో డిఎన్ ఏ ప‌రీక్షా కేంద్రానికి వెళ్లి కాస్తంత అనుమానంగా అనిపించిన 24 మంది తో త‌నను పోల్చి రిపోర్టు ఇమ్మ‌న్న‌ది. కానీ వారిలో స‌గం మంది దూర‌పు బంధువులే త‌ప్ప సొంత సోద‌రుడు లేద‌ని తేలింది. ఇక ఇక్క‌డితో అంతా అయిపోయింది. తిర‌గ‌డం వేస్ట్ అనే అనుకుంది.

ఇలా ఉండ‌గా, రేమాండ్ భార్య మ‌రియా అత‌ని చేత డి ఎన్ ఏ వంటి ప‌రీక్ష చేయించింది. వాస్త‌వానికి హామ్‌స్ట‌డ్‌లో అత‌ను త‌న తండ్రితో ఉంటున్నాడు. ఆయ‌న వివాహం చేసుకోలేదు. రేమాండ్‌, త‌న త‌మ్ముడూ ఇద్ద‌రూ అమ్మ‌మ్మ‌గారింట పెరిగారు. కానీ అత‌నికి ఒక సోద‌రి ఉంద‌న్న సంగ‌తి తెలియ‌దు. అయితే తాను చేయించుకున్న ప‌రీక్ష‌ల వ‌ల్ల తాను ఆఫ్రికా నుంచి  ఇక్క‌డికి వ‌చ్చిన కుటుంబానికి చెందిన‌వాడ‌ని తేలింది. దీన్ని ఆధారం చేసుకుని త‌న సోద‌రి గురించి తానూ వెత‌క‌డం ఆరంభించాడు.  కొద్ది నెల‌ల త‌ర్వాత క్రిస్టినా అనే ఆమె కూడా ఇదే లక్ష్యంతో తిరుగుతోంద‌ని తెలుసుకున్నాడు. ఆమె గురించి తెలుసుకోవ‌ డం లో అత‌నికి వారి తండ్రి ఒక్క‌డే అన్న‌ది తెలిసి ఎంతో ఆశ‌ర్య‌పోయాడు. కాగా 42 ఏళ్ల క్రిస్టినా త‌న 11 ఏళ్ల కుమారుడు బ్రైస‌న్‌కు న‌రాల వ్యాధి చికిత్స‌కు ఆస్ప‌త్రి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ క్ర‌మంలో రేమాండ్‌ని చాలాసార్లు చూసింది. అత‌నూ చూశాడు. కానీ ఆస్ప‌త్రికి వ‌చ్చిన వారిని చూసిన‌ట్టుగానే ఇద్ద‌రూ భావించుకున్నారే గాని హ‌లో అనుకోలేదు. చిత్రంగా ఇదంతా ఏకంగా ఏడేళ్లు సాగింది. 

కానీ ఒక‌రోజు రోడ్డు దాటి ఆస్ప‌త్రికి వెళుతూంటే రేమాండ్ అక్క‌డి కూడ‌లిలో గిటార్ ప‌ట్టి పాత పాట పాడుతున్నాడు. అది విని క్రిస్టినా అలా నిలుచుండిపోయింది. అంతే వేగంగా అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లి, ఈ పాట నీకెలా తెలుసు అది మా నాన్న‌గారు పాడేవార‌ట మా అమ్మ‌మ్మ చెప్పేది అన్న‌ది. అప్ప‌టికి రేమాండ్ కి అర్ధ‌మ‌యింది .. ఇన్నాళ్లూ చూస్తున్న ఈ క్రిస్టినాయే త‌న సోద‌రి అని. ఇద్ద‌రు త‌మ‌ని తాము గుర్తించుకున్నారు..క‌నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు..అన్నాచెల్లెళ్ల బంధాన్ని వ్య‌క్తం చేసుకున్నారు.