చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద హైటెన్షన్
posted on Oct 14, 2025 8:00PM

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చారు. కవితని లోపలి పంపించకుండా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు కవిత జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. నిరుద్యోగులు, తెలంగాణ జాగృతి నాయకులు భారీగా రావడంతో ఉదృత వాతావరణం నెలకొంది.
గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు కల్వకుంట్ల కవిత ఈరోజు సాయంత్రం సమయంలో సిటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు అయితే ఈ విషయం తెలియగానే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అదే సమయంలో కవిత అక్కడికి చేరుకొని లైబ్రరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో జాగృతి నాయకులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెలరేగింది. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేపట్టారు.. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా కూడా వినకుండా లైబ్రరీ గేటు ముందు నిల్చని ఉండడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.