Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అభిమానితో చంద్రబాబు ఆత్మీయ భేటీ
posted on: Jun 9, 2026 10:07AM

రాజకీయాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉంటారు. కానీ, కొందరు నాయకులు ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటారు. దానికి కారణం వారికున్న ప్రజాదరణ మాత్రమే కాదు, వారిలో దాగున్న మానవత్వం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఇలాంటి ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన ఘటనే చోటుచేసుకుంది. ఒక సాధారణ వ్యక్తి, వృద్ధుడూ తనను చూడాలని కోరుకుంటున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. క్షణం ఆలోచించకుండా ఆ వృద్ధుడికి తనను కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చారు. వివరాల్లోకి వెడితే..
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
దీంతో సీఎం చంద్రబాబు.. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని ఆ పెద్దాయనకు రిప్లై ఇచ్చారు. అన్నట్లుగానే.. సోమవారం (జూన్ 8) మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వచ్చిన సీఎం చంద్రబాబు...ఆ కార్యక్రమం అనంతరం సత్యనారాయణను తన బస్సులోకి ప్రత్యేకంగా పిలుపించుకుని ఆత్మీయంగా మాట్లాడారు.
కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని కూడా కోరారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు సత్యానారాయణ కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.






