ఊస‌ర‌వెల్లి మ‌హాత‌ల్లి!

బ‌డిపేరు ...విద్యాల‌యం అనేది    దాన్ని సాయింత్రానిక‌ల్లా మార్చేశాడు. ప‌క్కింటి పెద్దాయ‌న‌, ఎదురింటివాళ్లూ వీధిలో చాలాకాలం ఉంచి ఉన్న వారంతా క‌లిసి క‌ట్టుగా కాకున్నా వంతుల వారీగా కాస్తంత సౌమ్యంగానే తిట్టారు. పెద్దామె మాత్రం పోనీ లేద్దూ, వీధి పేరు ఉండ‌నే ఉందిగా అన్న‌ది. ఈసారి ప‌క్క వీధిలోవారూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈవిడేనా అన్న ది అని. 

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చ‌డం పై ఇప్ప‌టికే దేశ‌మంతా తెలుగువారు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ కాన్సెప్ట్‌ని అమ‌లు చేసిన వాడు ఎన్టీఆర్‌. అందుకు తెలుగు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. ఇప్ప‌టికీ ఆ వ‌ర్సిటీ ఎంతో గొప్ప‌సేవ‌లు అందిస్తోంది. ఎంతో ప్ర‌సిద్ధి పొందింది. కాగా త‌న‌కు న‌చ్చ‌లేద‌నో, వేరే పార్టీవారి  హ‌యాంలో ఏర్పాట‌యిన సంస్థ అనో ఏదో మిష‌తో పేరు మార్చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. అంతే అనుకున్న‌దే త‌డ వుగా దాని పేరు వైఎస్ ఆర్ హెల్త్ వ‌ర్సిటీగా మార్చేశారు.  కానీ దాన్ని ఇత‌ర మేధావుల‌ను గాని ఏమాత్రం సంప్ర‌దించ‌కుండానే కేవ‌లం అధికారంలో ఉన్న ద‌ర్పంతో ఆ నిర్ణ‌యం తీసేసుకున్నారు జ‌గ‌న్‌. అమ‌లు చేసిన నిర్ణయాన్ని కాదంది యావ‌త్ తెలుగు జాతి. 

అయితే ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి కాస్తంత ఆల‌స్యంగానే తేరుకుని అదేం పెద్ద వివాదాస్ప‌ద అంశ మే కాద‌న్నారు. పేరు మార్చినంత మాత్రాన ప్ర‌త్యేకించి ప‌రువుపోవ‌డాలు, మ‌ర్యాద‌లు త‌గ్గ‌డాలు ఉండ‌వ న్నారు. పైగా ఒక సంస్థ‌కు పేరుమార్చారు. కానీ ఎన్టీఆర్ పేరు శాశ్వ‌తంగా ప్ర‌జ‌ల మ‌ధ్య నిలిచేలా, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ నిరంత‌రం పొందేలా ఏకంగా ఒక జిల్లాకే ఆయ‌న‌పేరు ఉన్నది క‌దా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. ఒక జిల్లా పేరు ఉండ‌డం చాలా గొప్ప‌సంగ‌తి. ఒక సంస్థ‌కు ఉన్న‌పేరును ఎవ‌ర‌యినా మార్చుకోవ‌చ్చు. అలాంటపుడు హెల్త్‌వ‌ర్సిటీ పేరు ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్ల మ‌ధ్య పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌ వ‌స‌రం లేద‌ని ఆమె అభిప్రాయం. కానీ తెలుగు ప్ర‌జ‌లు అలా ఊరుకుంటారా? ఎంతో కాలం నుంచి ఆ మ‌హానుభావుడి పేరున ఉన్న‌ది ఇపుడు హ‌ఠాత్తుగా మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని మండి ప‌డుతున్నారు. ఎవ‌రు ఎలా స్పందించినా, అది ఎన్టీఆర్ ప‌ట్ల వారి వీరాభిమానానికి ద‌ర్ప‌ణం ప‌డు తుంది. 

ఒక సంస్థ కంటే కృష్ణా జిల్లా కి ఎన్టీ ఆర్  పేరు ఉండ‌డం పెద్ద విష‌యం గ‌నుక‌, ఆ జిల్లా అభివృద్ధి , ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్య‌త‌నీయాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి సూచించ‌డాన్ని కూడా లెక్క‌లోకి తీసుకోవాల‌ని విశ్లేష కుల మాట‌. ప్ర‌తీదీ రాజ‌కీయ కోణంలో చూడ‌టం త‌గ‌ద‌ని ఆమె అన్నారు. అయితే స‌మ‌యంగాని స‌మ యంలో ఇలాంటి ఆవేశ‌పూరిత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తుంద‌నేది వైసీపీ నాయ కుల మ‌న‌సులో మాట‌. అస‌లే మూడేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు కూడా ప్ర‌తిప‌క్షం స్థాయిలో విసిగెత్తి, ఎదురు తిరుగుతున్నారు. ఎక్క‌డా మంత్రులు, ఎమ్మెల్యేలు తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌రుణంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం పార్టీ భ‌విత‌ను దెబ్బ‌తీస్తుందనేది వారు బ‌య‌ట‌కు చెప్ప‌లేని మాట‌. 

ఇక్క‌డ మ‌రో మాట‌.. అస‌లు సంస్థ పేర‌యినా, జిల్లాకి పేరు పెట్ట‌డం లేదా తీసేయ‌డం అనే అంశాల్లో ల‌క్ష్మీపార్వ‌తి మ‌హోన్న‌త అభిప్రాయాలు, సూచ‌న‌లు ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మా? అని విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే, ఆమె ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే అంటిపెట్టుకుంటాన‌ని పూర్వం శ‌ప‌థం చేసి  ఆ త‌ర్వాత రాజ‌కీప‌రిణామాల్లో పార్టీకి దూర‌మ‌య్యారు. ఇపుడు జ‌గ‌న్ అభిమానిగా మారి వైసీపీ జెండా నీడ‌లో సంచ‌రి స్తున్నారు. క‌నుక ప్ర‌బుత్వ నిర్ణ‌యం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరాభిమానుల‌కు ఎలా శిరోధార్య మో ల‌క్ష్మీ పార్వ‌తికి కూడా అంతే. అందుకే ఆమె వ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యాన్ని పెద్ద‌గా సీరియ‌స్‌ గా తీసుకో లేదు.. పైగా  కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరుంది గ‌దా.. వ‌ర్సిటీ  పేరు విష‌యం చిన్న‌దిగానే క‌న‌ ప‌డింది. 

అయితే అన్ని వ‌ర్గాల నుంచి ముఖ్యంగా విప‌క్షాల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా  ఆమె ఆ విధంగా  స్పందించారు. కానీ గ‌తంలో ఎన్టీఆర్‌కు ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్టాడినా విరుచుకుప‌డిన ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్సిటీ పేరు మార్ప‌డి విష‌యంలో మాత్రం గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌క‌పోవ‌డం ప‌ట్ల అంత‌టా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇపుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఖండించ‌క‌పోవ‌డ‌మే ఆమె ప‌రిస్థితి వ్య‌క్త‌ మ‌వుతుంది.  ఏ గాలి కా మాట మాట్లాడుతోంద‌న్న‌ది ప్ర‌జ‌లు గ్ర‌మించారు. ఇలాంటి ఊస‌ర‌వెల్లి త‌త్వాన్ని ఆమె త‌ప్ప మ‌రొక‌రు ప్ర‌ద‌ర్శించ‌లేరు.