సెల్‌ఫోన్ వుందా?.. మీకో గుడ్ న్యూస్!
posted on Jun 24, 2014 6:11PM
.jpg)
మీ దగ్గర సెల్ ఫోన్ వుందా.. ఆ సెల్ ఫోన్‌లో మీరు గంటల తరబడి మాట్లాడుతూ వుంటారా.. పోనీ అప్పుడప్పుడు అయినా మాట్లాడుతూ వుంటారా? సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అనారోగ్యం కలుగుతుందేమోనని భయపడుతూ వుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్.. సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఎంతమాత్రం ప్రమాదకరం కాదు.. ఇన్నాళ్ళూ సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరమని అందరూ భావిస్తు్న్నారు. అయితే అలా భయపడాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక మనం హాయిగా ఎంతసేపైనా సెల్ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోన్ నుంచి గానీ, సెల్ టవర్ నుంచి గానీ వెలువడే రేడియేషన్ ప్రమాదాకారి కాదని నిపుణులు తేల్చి చెప్పారు. సెల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించారు. అలాగే సెల్ ఫోన్ల ద్వారా గానీ, సెల్ టవర్ల ద్వారా గానీ కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా లేదని ప్రకటించారు.