దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
posted on Jan 2, 2025 9:19AM

దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 19న దావోస్ కు బయలుదేరి వెడతారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో అధికారుల బృందం హాజరు కానుంది.
ఈ బృందంలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా దోవోస్ కు బయలుదేరుతున్న బృందంలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా చంద్రబాబు రాష్ట్రంలో వనరులు, పెట్టుబడులకు అన్న అవకాశాలను పెట్టుబడి దారులకు వివరించనున్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన ఉండనుంది.