బీహార్‌ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే తరఫున తాను ప్రచారం చేయనున్నట్లు వెల్లడించిన ఆయన బీహార్ లో  ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 మోదీ పరిపాలనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్న చంద్రబాబు..  జీఎస్టీని సంస్కరణల  వల్ల ప్రజల వద్ద డబ్బులు మిగులుతున్నాయని .. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచుతుంద అన్నారు. తన బీహార్ పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu