చంద్రబాబు దుబాయ్ పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
posted on Oct 22, 2025 10:21AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలక్ష్యంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఆ లక్ష్య సాధనలో బాగంగానే ఈయన మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోసం బుధవారం (అక్టోబర్ 22) ఉదయం అమరావతి నురంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి యూఏఈ యాత్రకు బయలుదేరారు. విశాఖలో ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన భాగస్వామ్య సదస్సుకు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులు హాజరు కానున్నారు. తన యూఏయూ పర్యటనలో కూడా చంద్రబాబు వివిధ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన వారిని ఆహ్వానిస్తారు.
ఇక పోతే తన యూఏఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అలాగే తన పర్యటన తొలి రోజు అయిన బుధవారం చంద్రబాబు ఐదు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇక రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు.