హైదరాబాద్ కు ఐఎస్ బీ.. చంద్రబాబు పుణ్యమే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు మేధావులు. గత నాలుగు దశాబ్దాలకు పైగా చంద్రబాబునాయుడు దేశంలోనే  అత్యంత ప్రగతిశీల, దార్శనిక నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. అదే విషయాన్ని పలువురు విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి కాముకులు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు దార్శనికత గురించి మరో ప్రముఖ విద్యావేత్త ప్రస్తుతించారు.  ఆయన చంద్రబాబు ఆప్రోచ్, విజన్, కృషి, పట్టుదలలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. ఆయన  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తొలి డీన్ అయిన ప్రమత్ రాజ్ సిన్హా. ప్రమత్ రాజ్ సిన్హా  తాజాగా ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ కు ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ ను తీసుకురావడంతో చంద్రబాబు కృషిని మరోసారి కళ్లకు కట్టారు. 

అసలు ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం అనేది జరిగే పని కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదేపదే రుజువు అవుతోంది.  రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట  ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ   చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.ఇండియన్ బిజినెస్ స్కూల్ గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఉండదు.  ఎందుకంటే కేవలం చంద్రబాబు కృషి, దూరదృష్టి ఫలితంగానే హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూల్ వచ్చింది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది తిరుగులేని నిజం. 

అదే విషయాన్ని ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తొలి డీన్ మరోసారి చెప్పారు.  హైదరాబాద్ కు ఐఎస్ బీ క్యాంపస్ ను చంద్రబాబు హైదరాబాద్ కు ఎలా తీసుకువచ్చారో వివరించారు. వాస్తవానికి తొలుత ఐఎస్ బీ క్యాంపస్ ను ముంబైలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే  బాల్ థాకరే కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నారు. అప్పట్లో బాల్ థాకరే  ఐఎస్ బీ క్యాంపస్ ముంబైలో ఏర్పాటు చేయాలంటే అందులో 50శాతం సీట్లు మరాఠీ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని షరతు విధించారు. అలాగే సిబ్బంది విషయంలో కూడా స్థానికులకు అంతే రాజర్వేషన్ కల్పించాలని కండీషన్ పెట్టారు. ఆ ఒత్తిడి కారణంగానే ఐఎస్ బీ క్యాంపస్ ను ముంబైలో ఏర్పాటు చేయాలన్న యోచన నుంచి మేం వెనక్కు తగ్గామని  ప్రమత్ రాజ్  చెప్పారు.  ఎందుకంటే తొలి నుంచీ కూడా విద్యాసంస్థలకు అటువంటి రిజర్వేషన్లు, కండీషన్లు ఉండకూడదన్నది మా భావన.  

సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని అప్రోచ్ అయ్యారని ప్రమత్ రాజ్  సిన్హా గుర్తు చేసుకున్నారు. ఐఎస్ బి క్యాంపస్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు మమ్మల్ని ఆహ్వానించారని చెప్పిన ఆయన ఆయన ఆహ్వానం చాలా సాదరంగా ఉందనీ, కేవలం ఆయన దార్శనికత, రాష్ట్ర ప్రగతి పట్ల ఆయన తపన చూసే తాము హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఐఎస్ బి క్యాంపస్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలూ పరిశీలించేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చామన్నారు.   అప్పట్లో ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చాయి. ఆ బిజినెస్ స్కూల్ ప్రమోటర్ల బృందంలో  ప్రమత్ రాజ్  సిన్హా ఒకరు. ప్రమోటర్స్ తో సంప్రదించడానికి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్ర సీఈవోగా మాదిరిగా కష్టపడ్డారు. ఆ సమయంలో మేం చంద్రబాబుకు ముఖం మీదే.. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ  మేం కుండబద్దలు కొట్టినట్టు  చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు. ప్రయత్నాలు మానలేదు.

మీరు బిజినెస్ స్కూల్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, ఒక్కసారి హైదరాబాద్ వచ్చి అక్కడి అవకాశాలూ పరిశీలించండంటూ ఆహ్వానించారు. ఆలా చంద్రబాబు ఆహ్వానంతో మేం హైదరాబాద్ కు వచ్చాం అని ప్రమత్ రాజ్ సిన్హా వివరించారు.  అయితే అలా వచ్చినప్పుడు కూడా  మాలో హైదరాబాద్ లో ఐబీఎస్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఈషాణ్మాత్రం కూడా లేదు. అయితే మా బృందం హైదరాబాద్ చేరుకోగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు మా బృందాన్ని తేనీటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లుగా అప్పటికే మేం ఎన్నో రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. కానీ ఏపీతో సంప్రదింపులు మాత్రం స్పెషల్. ఎందుకంటే అప్పటి వరకూ మా సంప్రదింపులన్నీ బ్యూరోక్రాట్లతోనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి  స్వయంగా మాతో సంప్రదింపులు జరిపారు అని ఆయన వివరించారు. చంద్రబాబు నివాసంలోనే తేనీటి విందు ఏర్పాటు చేసి.. ఆయనే స్వయంగా మాకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారని ఆయన చెప్పారు. ఆ సమావేశంలోనే  ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వివరించి మమ్మల్ని అబ్బురపరిచారని ఆయన గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత మా బృందాన్ని  మెస్మరైజ్ చేశాయి. దాంతో హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చిందని హైదరాబాద్ కు బిజినెస్ స్కూల్ రావడం కోసం చంద్రబాబు పడిన తపనను ప్రమత్ రాయ్ కళ్లకు కట్టినట్లు వివరించారు.  చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు. అలా చంద్రబాబు కృషితో హైదరాబాద్ కు వచ్చిన ఐఎస్ బీ ఇప్పుడు అంతర్జాతీయంగా తిరుగులేని గుర్తింపు పొందిన సంస్థగా నిలిచింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu