ఉర్సు మహోత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక  అందజేశారు.  

జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉర్సు మహోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దర్గాపీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు.  ఉర్సు మహోత్సవాలని నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu