గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ పై సీబీఐ దర్యాప్తు?!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ రంగంలోనికి దిగనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ రాజకీయాలలో కూడా దుమారం రేగుతోంది. గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నారు.

అది ఫేక్ వీడియో అనీ, తనను బదనాం చేయడానికి కుట్ర పూరితంగా ఫేక్ వీడియోను సృష్టించారనీ ఆరోపిస్తున్నారు. బీసీ కార్డును వాడుకుంటూ.. ఇక బీసీనీ అయిన తనను రాజకీయంగా సమాధి చేయాలన్న తెలుగుదేశం కుట్రలో భాగమే ఈ వీడియో అని ఆరోపిస్తున్నారు. మరో వైపు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎటువంటి పోరెన్సిక్ పరీక్షలూ లేకుండానే గోరంట్ల న్యూడ్ వీడియో ఫేక్ అని  సర్టిఫికేట్ (తీర్పు) ఇచ్చేశారు. అదే సమయంలో

ఏపీలో రచ్చగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఈ న్యూడ్ వీడియో తనది కాదు ఇది ఫేక్ అని ఎంపీ గారు అంటున్నారు.తనను బదనాం చేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. కొందరు కలసి బీసీనైన తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

ఇలా ఉండగా  తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి   అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేసిన టెస్టులలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలింది అంటూ మాధవ్ పై చర్యకు డిమాండ్ చేశారు.  కాగా ఈ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై  జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. పంజాబ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీ లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసి ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా   దీని మీద పూర్తి విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరింది.

తాజాగా   ఏపీ హై కోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మాధవ్ ది అని భావిస్తున్న వీడియోపై  సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మీద దర్యాప్తు జరపాలని ఆ లేఖలో కోరారు. అలాగే మాధవ్ మీడియా ముందు చేసిన కామెంట్స్ వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ ఆ వీడియో బైట్స్ ని కూడా సీబీఐకి పంపించారు.ఆయన తన ఫిర్యాదుని ఈ మెయిల్ ద్వారా చెన్నై లో ఉన్న సీబీఐ అఫీసుకు పంపించారు. మరి సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.