Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీబీఎన్ కీర్తి కిరీటంలో మరో కలికితు రాయి
posted on: Apr 25, 2026 7:56PM
.webp)
ముంబైలో సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు..
ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది. తాజాగా ఆయన ముంబై వేదికగా ప్రతిష్టాత్మకమైన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. ఆ విజనరీ లీడర్‌కు అవార్డులు కొత్తమీ కాదు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. పలు ప్రముఖ పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. ‘ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలేనియం’గా, ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’, ‘సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్’ వంటి బిరుదులతో సత్కరించాయి.
అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును ‘హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్’లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ ‘సైబర్ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్ వార్తా సంస్థ ‘సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని ప్రశంసించింది. ఇక ఇఫ్పుడు ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' సీఎం దార్శనికతకు, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని ప్రదానం చేసింది.
పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వాణిజ్యంలో చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డును అందించింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీని కీలక భాగస్వామిగా మలిచినందుకు సీఎంకు ఈ గౌరవం దక్కింది. ముంబై పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణకు మరింత బలాన్ని చేకూర్చనుందని అధికారులు అంటుండటం విశేషం.






