రుజువు కోసం పాము తెచ్చాడు!

బ‌డికి వెళ్లేవాడు టీచ‌ర్ ఏమ‌డు గుతుందా అని భ‌య‌ప‌డ‌తాడు. హోంవ‌ర్క్ చూపినా నువ్వే చేశావా? అని వెయ్యి అనుమానాల‌తో రెండు ప్ర‌శ్న‌లన్నా అడుగుతుంది టీచ‌ర్‌. అందుకే లెక్క‌ల పుస్త‌కంలో లెక్క‌, హోంవ‌ర్క్ చేసిన‌ది ఒకటేన‌ని చూప డానికి ఓ పిల్లాడు వాళ్ల‌మ్మ‌ చేత ఫోన్ చేయించి మ‌రీ చెప్పించా డ‌ట‌. అప్పుడుగాని ఆ టీచ‌ర్ న‌మ్మ‌ లేదు. అదుగో అలాంటి ప్ర‌శ్న‌ ల‌తో చంపు తార‌నే రామేంద్ర యాద‌వ్ ఓ చిన్న ప్లాస్టిక్ బాటిల్‌లో ఏకంగా చిన్న పామును బంధించి మ‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసికెళ్లాడు. వాళ్ల ప్రిస్క్రిప్ష‌న్ లా వారి ప్ర‌శ్న‌లు బొత్తిగా అర్దంగావుగ‌దా.. అందుక‌ని!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉన్నావ్ జిల్లాలో రౌఅఫ్జ‌ల్ న‌గ‌ర్‌ రామేంద్ర యాద‌వ్ నివాసం. ఆమ‌ధ్య ఒక రోజు ఆయ‌న భార్య ఇంటి పెర‌ట్లో ప‌ని చేస్తుండ‌గా ఓ పాము వ‌చ్చి కాటేసింది. అంతే ఆమె విల‌విల‌లాడిపోయింది. ఆమె అరుపుల‌కు యాద‌వ్ వ‌చ్చి చూసేస‌రికి ఆమె ప‌డిపోయి ఉంది. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి తీసికెళ్ల‌బోయాడు. అంత‌లో పాము అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోనే ఉండ‌డం చూశాడు. దాని నెత్తిన ఒక్క‌టి కొట్టి ఓ ప్లాస్టిక్ సీసాలో పెట్టి బూచాడిని బంధించిన‌ట్టు చేసి ఆ సీసాతో పాటు ఆస్ప‌తికి భార్య‌ను తీసికెళ్లాడు. 

ఆయ‌న హ‌డావుడి చూసి డాక్ట‌రు వ‌చ్చి ఏమ‌యింద‌ని అడిగాడు. పాము కాటు వేసింది. వెంట‌నే వైద్యం చేయండిబాబా, లేకుంటే చ‌నిపోతుందేమో అని భ‌యంతో వేడుకున్నాడు. డాక్ట‌రు ఇంకా ఏదో అడ‌గ‌బోయాడు. అంత‌లో సీసాలో ఉన్న పాముని చూపిం చాడు. అది చూసి డాక్ట‌ర్ ఖంగారుప‌డి అదెందుకు తెచ్చావ‌య్యా సామీ.. అని అడిగాడు. అబ్బే ఏంలేదు, పాము క‌రిచింది అన గానే అది ఏ పాము, దాని జాతేందీ.. అడుగుతారు గ‌దా.. అందుకే చూపిస్తే స‌రిపోద్ద‌ని తెచ్చా సార్‌! అన్నాడు చ‌క్క‌గా సీసాలో క‌దులుతున్నా పామును చూపించి. అయితే  సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెళ్లేలా రంధ్రాలు చేశాడు అదీ చిత్రం.  అత‌ని భార్యకి వైద్యంచేశారు. ఆమె బ‌తికింది. యాద‌వ్ ఆ పామును అడ‌విలో వ‌దిలేశాడు.