భారత్ క్షిపణిలకు పాక్ తప్పించుకోలేదు : రాజ్‌నాథ్ సింగ్
posted on Oct 18, 2025 2:56PM
.webp)
భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులు చేరాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని పాకిస్తాన్ హెచ్చరించారు.
దాయాదులు దుస్పాహసాని తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్ సైన్యం పరాక్రమం అప్రతిహతం. మనకు ఉన్న ఆధునిక క్షిపణి సామర్థ్యాల ముందు శత్రువులు తప్పించుకోలేరని రక్షణ మంత్రి అన్నారు.ఇదే సందర్బంగా బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. “తొలిసారి విదేశీ నిపుణులు లఖ్‌నవూకు రానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు దాటుతుంది. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుంది” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.