కూతురితో లవ్ .. తల్లితో.. 

వాళ్లిద్దరూ ఇద్దరు ప్రేమికులు. రెండేళ్లు ఏళ్ళు ప్రేమ కథలు చెప్పుకున్నారు . ఒకరి మనసులు ఒకరికి ఇచ్చుకున్నారు. వారి ప్రేమ కులాల అడ్డుగోడలతో విడిపోయింది..  ఒక్క సరిగా వారి కలలు చెదిరిపోయాయి. 

నాకు త్వరలో పెళ్లి చేయబోతున్నారు. అని తన ప్రియుడితో చెపింది ఆ యువతి.. ప్రియురాలు నోటినుండి ఆ మాట విన్న ప్రియుడు గొంతు మూగబోయింది. ఏం చేయలేని పరిస్థితిలో అక్కడి నుండి వెనుతిరిగాడు. తల్లిదండ్రుల బలవంతంతో యువతి పెళ్లికి ఓకే చెప్పింది. దీంతో వెంటనే అమ్మాయికి వేరే యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి. 

కట్ చేస్తే.. ప్రియుడు షాక్ ఇచ్చాడు. రూ.ల‌క్షా 50 వేలు ఇవ్వాల‌ని, లేక‌పోతే త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తాన‌ని బెదిరించాడు. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ళ యువకుడు తన కాలేజీ లో చదివే యువతి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో కులాలు వేరు.. ఈ పెళ్లి జరగదు అంటూ అమ్మాయికి వేరే సంబంధం చూశారు. దీంతో కొద్దికాలం మౌనంగా ఉన్న ప్రియుడు, ప్రియురాలి పెళ్లికి మరికొన్ని రోజులు ఉందనగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రూ.ల‌క్షా 50 వేలు ఇవ్వాల‌ని, లేక‌పోతే త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తాన‌ని యువతిని బెదిరించాడు.

అమ్మాయి పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుంది అని గ్రహించిన యువతి తల్లి అతడు అడిగిన మొత్తాన్ని చెల్లించింది. అయిన‌ప్ప‌టికీ అత‌డు.. యువ‌తి పెళ్లిచేసుకోబోయే వ్య‌క్తికి ఆ వీడియోల‌ను పంపించాడు. ఆ వీడియోలను చూసిన పెళ్ళికొడుకు తనకు పెళ్లి వద్దని రద్దు చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రియుడును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.