శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
posted on Dec 9, 2025 9:12AM
.webp)
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి మరో సారి బాంబు బెదరింపు కాల్ వచ్చింది. న్యూయార్క్‌కు చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి పేరిట వచ్చిన ఈ మెయిల్ తో అప్రమత్తమైన విమానాశ్రయాధికారులు సెక్యూరిటీని అలర్ట్ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.
శంషాబాద్ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్ లో జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ఎయిర్పోర్ట్ లోపలి, బయటి ప్రాంతాలు, పార్కింగ్, కార్గో, రన్‌వే పరిసరాల్లో విస్తృతం గా తనిఖీలు చేపట్టాయి. అమెరికా బౌండ్ విమానాలకు అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.ఈ మెయిల్ మూలం, పంపిన వ్యక్తి వివరాలపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగు తున్నప్పటికీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకవైపు వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్, మరోవైపు విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.