మరిన్ని రాష్ట్రాల విభజనకు బీజేపీ ప్రణాళికలు!

 కాంగ్రెస్ అధికారం దిగిపోతూ తెలుగు రాష్ట్రాల‌ను విభిజించింది. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం మాట ఎలా వున్నా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య స్నేహ‌బంధాలు దెబ్బతిన్నాయి. రాజకీయ లక్ష్యం నెరవేర్చుకోవడానికి అడ్డగోలుగా తెలుగు రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ కు అటు రాజకీయ లక్ష్యం నెరవేరకపోగా   ప్ర‌జ‌లలో తీవ్ర అసంతృప్తిని మిగిల్చి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ఉనికి కోల్పోయే పరిస్థితి కొని తెచ్చుకుంది. కేంద్రం నుంచి రావ‌ల‌సిన నిధులు, ప్రాజెక్టులు ఇత‌ర‌త్రా ఆర్ధిక మ‌ద్ద‌తులు ఏవీ ల‌భించ డం లేద‌ని కేంద్రం మీద ఇప్ప‌టికీ ఇరు రాష్ట్రాలూ కారాలు మిరియాలూ నూరుతున్నాయి.

ఇప్పుడు బిజెపి ఈ రెండు రాష్ట్రాల్లోనూ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి అధికారంలోకి రావాల‌న్న ఆతృ త బాగా ప్ర‌ద‌ర్శిస్తోం ది. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి  బిజెపి ల‌క్ష్యం నెర‌వేరుతుందా లేదా అన్న‌ది వేరే విష‌యం. ఇపుడు  క‌ర్ణాట‌కా లోనూ ఇదే దృశ్యం  త్వ‌ర‌లో చూడాల్సి వస్తుందని అనిపిస్తోంది. అందుకు  వుదా హ‌ర‌ణ ఆ రాష్ట్ర అట‌వీశాఖ మంత్రి ఉమేశ్ క‌త్తి చేసిన ప్ర‌క‌ట‌న‌.  ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమేనని ఇందులో సందేహమే లేదని ఇది బీజేపీ నిర్ణయం కాదని తన వ్యక్తిగతమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేశ్‌కత్తి వెల్లడించారు.

బెళగావిలో బుధవారం న్యాయవాదు లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరిన్ని రాష్ట్రాలను విభజించనున్నారన్నారు.  మహారాష్ట్రను మూడుగాను, కర్ణాటకను రెండుగాను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగుగాను మార్చాల‌నే  ఆలోచ‌న లో కేంద్రం వుందని ఆయన సెలవిచ్చారు.  తద్వారా దేశంలో త్వరలో రాష్ట్రాల సంఖ్య 50 కి పెరగనుందన్నారు. ఇప్ప టికే ఈ దిశగా చర్చలు సాగుతున్నా యన్నారు. అయితే ఈ విధంగా ముక్క‌లుగా దేశాన్ని విడ‌గొడితే  దేశంలో అనై క్య‌త వెల్లు వెత్తి  భిన్న‌త్వం లో ఏక‌త్వ సిద్ధాంతానికి అర్ధంలేకుండా పోతుంద‌నే ఆందోళ‌నా త‌లెత్త‌క పోదు.

రాజ‌కీయ ల‌బ్ధికోసం త‌మకు తోచిన విధంగా విభ‌జ‌న‌లు చేస్తూపోతే  దేశంలో అశాంతి పెల్లుబికే అవ‌కాశం కూడా వుంది. రానున్న రోజుల్లో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చూస్తారన్నారు. బెంగళూరు కథ ముగిసిందని ఉమేశ్ అన్నారు.  నా నివాసం నుంచి విధాన సౌధకు వెళ్లాలంటే  ప‌ది కిలోమీటర్ల దూరం ఉందని  కానీ గంటన్న రకు  పైగా సమయం పడుతుందన్నారు. ఇది ఇక్కడి ట్రాఫిక్‌ పరిస్థితి అన్నారు. ఐటీ, బీటీ, పరిశ్రమలు పెరిగి రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చునన్నారు.  భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ కేంద్రం నిజంగానే  మ‌రిన్ని రాష్ట్రాల  ఆలోచ‌న‌లో వుంటే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారా?  రాజ‌కీయ ల‌బ్ది కోసం  రాజ కీయ పార్టీలు, ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇటీవ‌లి కాలంలో దేశంలో ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా వుండ‌డం లేదు.