మరో కేంద్ర మంత్రి  మరో వివదాస్పద వ్యాఖ్య 

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ, సామాన్య ప్రజలనే కాకుండా, అన్ని వర్గాల వారిని ఆందోళనకు, ప్రాణ భయానికి గురిచేస్తున్న కరోనా విషయంలో, కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు  చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. విమర్శలకు తావిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ప్రతి రోజూ, ప్రతి ఒక్కరూ  గోమూత్రం తాగితే కరోనా ఖతమై పోతుందని అంటే, మరొకరు యజ్ఞ యాగాదులతో, కరోనా కష్టాలు తొలిగి పోతాయని అన్నారు. అలాగే, రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కరోనా కూడా మనిషిలాంటి మరో జీవని, మనిషిలానే జీవిచేందుకు పోరాటం చేస్తోందని, ఆ క్రమంలో కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని అన్నారు. ఇలా, బీజేపీ నాయకులు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అవి వివాదాస్పదం లేదా నవ్వుల పాలవుతున్నాయి. 

ఇప్పుడు తాజాగా కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, సదానంద గౌడ్, మరో మెట్టెక్కి సుప్రీం కోర్టు వ్యాఖ్యలనే తప్పు పట్టే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్సిన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు చేసిన సూచనను మంత్రి స్వాగతించారు. కోర్టు మంచి సూచన చేసిందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పం కూడా అదేనని,అందుకోసం ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తోందని చెప్పారు. అయినా, ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.అయితే, అంతటితో అగకుండా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. అయితే అది ఆయన ఉద్దేసపూర్వకంగా వేసిన  అడుగు, చేసిన వ్యాఖ్య కాదు. నిజానికి ఆయ ఆగ్రహం వ్యక్తపరిచింది, న్యాయస్థానంఆపి కాదు,  దేశ ప్రజలు అందరికీ, వాక్సిన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన విషయాన్నే, విలేకరులు పదే పదే ప్రస్తావించి,  ప్రభుగ్వం ఏమి చేస్తుందని గుచ్చి గుచ్చి అడగడంతో మంత్రి బాలన్స్ తప్పారు. కోర్టు చెప్పినన్ని వాక్సిన్’లు ఇవ్వకపోతే ఏమి చేయాలి, ఉరేసుకోవాలా? అని అసహనం వ్యక్తపరిచారు. 

అయితే, సదానంద గౌడ్ కానీ ఇంతక ముందు గోమూత్రం చిట్కా చెప్పిన యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యాలు, కానీ అదే విధంగా యగ్నయాగాదులతో కరోనాను నియంత్రిచవచ్చని మరొకరు చేసిన వ్యాఖ్యలు కానీ, గీతదాటి చేసిన విచిత్ర వ్యాఖ్యలు కాదు. నిజానికి, గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని,మన వేదాలే కాదు పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. అంగీకరించడమే కాదు, గోమూత్రంపై అనేక పరిశోధనలు చేసి, కాన్సర్ సహా అనేక భయకర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. 

అంతేకాదు, ఇటీవల జరిపిన పరిశోధనల్లో గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు సమసిపోతాయి అని తేలింది. గోమూత్రం వాత పిత్తాలను సమతౌల్యం చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, యూరియా, అమ్మోనియా, సల్ఫర్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్, మాంగనీస్, కార్బోలిక్ యాసిడ్, క్యాల్షియం లాంటి మూలకాలే కాదు విటిమిన్ ఎ, బి, డి ఈ కూడా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలో గుర్తించారు. కేవలం గ్యాస్టిక్ర్, ఎసిడిటీ సమస్యలనే కాదు చర్య వ్యాధులను కూడా గోమూత్రం దూరం చేస్తుంది. కేన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది.అలాగే, గోమూత్రం తీసుకోవడం వలన, ఆక్సీకరణ జరుగుతుందని (శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి), అధిక రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఇవ్వన్నీ, మన వాళ్ళు కాదు, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, వైద్యులు పరిశోధనల సారంగా చెపుతున్న మాటలు. అయితే, ప్రస్తతం ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగికి, గోమూత్రం పనిచేస్తుందా అంటే చేయక పోవచ్చును. కాబట్టి, గోమూత్రం చిట్కాగా పనిచేయక పోవచ్చును కానీ, దీర్ఘకాలంలో గోమూత్రం ఒక కరోనాకు మాత్రమే కాదు, ఇంకా చాలా వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. నిజానికి, సుమారు వందేళ్ళు బతికిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎప్పుడోనే తమ ఆరోగ్య రహస్యం, తు రోజూ తీసుకునే గోమూత్రం అని చెప్పారు. అలాగే, యజ్ఞ యాగాదుల వలన పర్యావరణ సమతుల్యత ఏర్పడడంతో ఏర్పడడంతో కాలుష్యం కట్టడి అవుతుంది . ఇది మనదరికీ అనుభవంలో ఉన్న విషయమే. అయితే, కరోనా భయం కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనేదే ప్రశ్న. అక్కడే కమల దళం నాయకుకులు తప్పులో కాలేసి, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే మీడియాకు దొరికి పోతున్నారు.నవ్వుల పాలవుతున్నారు.