ఎందుకోయీ కేసీఆర్ పై ఈ కాషాయ ప్రేమ‌!

చిన్న‌పామునైనా పెద్ద కర్ర‌తో కొట్ట‌మ‌న్నారు. ఇదే సూత్రం బిజెపి టిఆర్ ఎస్‌పై అమ‌లు చేస్తోంది. తెలంగా ణాలో ఎలాగైనా పాగా వేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వున్న బిజెపీ కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండగ‌డుతూ, లోపాల చిట్టాను ప‌ట్టుకుని వేధించ‌డానికి గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకుంది.  కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగాణా ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేస్తోంద‌ని ఘాటుగా విమర్శ‌లు ద‌ట్టిస్తూ  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లో క‌ల్పించ‌డానికి బిజెపీ వ‌ర్గీయులంతా తెగ కృషి చేస్తున్నారు. 

 ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం  బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ  వైఫ‌ల్యాలపై బీజేపీ అధ్య యన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్యయన‌ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ‌ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. కమిటీ నిర్వహించనున్న సమావేశానికి కమిటీ సభ్యులు, ఇతర నేతలు హాజరు కాను న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి  బలంగా తీసుకెళ్ళేలా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీలను విస్మరించిందని కమల నాథులు చెబుతున్నారు.  

కేసీఆర్ ప్ర‌భు త్వం తెలంగాణాను బంగారు తెలంగాణాగా మారుస్తాన‌ని భారీ హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర అభివృద్ధి శూన్య‌మ‌ని చాలారోజులుగా  బిజెపీ  నాయ కులు విమ‌ర్శ ల‌తో దాడి చేస్తున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు వాటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యో జ‌నం క‌లుగు తోందన్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నది బిజెపీ నాయ‌కులు  పెద్ద కార్య‌క్ర‌మంగా పెట్టు కున్నారు.  అం దుకే, అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ అనేకానేక అంశాల‌పై వివ‌రాలు తెలుసుకుని ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని బిజెపీ తెలంగాణా నాయ‌కులు పూనుకున్నారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో  బిజెపీ నాయ‌కులు కొంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

బిజెపి నాయ‌కుల‌కు, ఢిల్లీలోని బిజెపీ పెద్ద‌ల‌కు తెలంగాణా మీద అక్క‌సుతో వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్ప వేరే ప‌నిలేద‌ని టిఆర్ ఎస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై తో  మొన్న‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మావేశాలూ, మాట‌లూ లేకుండా కేసీఆర్ దూరంగా వుండ‌డం, స‌మ‌తా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాని మోదీ వ‌చ్చిన‌పుడు కేసీఆర్ ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డం మొద‌లైనవ‌న్నీ బిజెపీ వ‌ర్గీయులు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ప్ర‌తీ చ‌ర్చ‌లోనూ తెలంగాణా కేంద్ర స‌హాయాన్ని విస్మ‌రించిందని ఎదురుదాడులు చేయ‌డమే సిద్ధాంతంగా పెట్టుకున్నారు. ఇపుడు తాజాగా అధ్య‌య‌న క‌మిటీ అనే పేర ఏకంగా ఒక క‌మిటీ ఏర్పాటు చేసి టిఆర్ ఎస్ ప్ర‌భ‌త్వం ఇంత కాలం చేసిన‌వ‌న్నీ పెద్ద జాబితాగా త‌యారు చేయ‌డంలో బిజెపీ నాయ‌కులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఆగ్ర‌హం వుండ‌డం కూడా ఒక్కింత ప్రేమ వుండ‌డ‌మే నేమో అందుకే  క‌మ‌ల‌నాధులు కేసీఆర్‌ను త‌మ ధోర‌ణిలో ప్రేమిస్తున్నారు.