బిజెపి 2024 వ్యూహం .. షిండేకి ప‌ట్టాభిషేకం!

కొన్ని అంద‌రికీ తెలిసే జ‌రుగుతాయి. మ‌రికొన్ని జ‌రిగిన త‌ర్వాతే తెలుస్తాయి. కొన్నింటికి వ్యూహ ర‌చ‌న చాలా రోజుల క్రిత‌మే జ‌రుగుతుంది. జ‌రిగిన త‌ర్వాత అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డ‌తారు.  మ‌హారాష్ట్ర సంక్షోభానికి తెర‌ప‌డ‌టం, శివ‌సేన నాయ‌కుడు షిండే ముఖ్య‌మంత్రి కావ‌డం మూడ‌వ కోవ‌లోకే వ‌స్తుంది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ముందు ఫ‌డ్న‌వీస్‌ను అనుకుని ఆన‌క షిండేను ప్ర‌క‌టించ‌డం, ఫ‌డ్న‌వీస్‌ని  ఉప ముఖ్య మంత్రిని చేయ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. చివ‌రి నిమిషంలో ఈ మార్పు వ్య‌వ‌హారం అంతా వాస్తవానికి  బిజెపీ వ్యూహ‌మే. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులుచేర్పులు చేసింద‌నే అభిప్రాయాలు అంత‌టా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మొద‌ట ఫ‌డ్న‌వీస్ బ‌య‌ట‌నుంచే మ‌ద్ద‌తునిస్తాన‌ని అన్నారు. కానీ ఆయ‌న్ను ఉప‌ముఖ్య‌మంత్రిగా వుం డేందుకు అంగీక‌రించేలా చేయ‌డానికి ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి ఛీఫ్ న‌డ్డా రంగం లోకి దిగాల్సి వ‌చ్చింది. స‌రే పార్టీ పెద్ద‌లంతా చెబుతున్నారు గ‌నుక ఫ‌డ్నీవీస్ స‌రే అన‌కా త‌ప్ప‌లేదు. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా చేసి ఇపుడు ఉప ముఖ్య‌మంత్రిగా చేయ‌డానికీ అంగీక‌రించిన రాజ‌కీయ నాయ కుల‌లో ఫ‌డ్న‌వీస్ నాలుగ‌వ స్థానంలో వున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిందేమంటే, ఈ విధంగా ప‌ద వుల్లో మార్పులు చేర్పులు చేయ‌డం ద్వారా శివ‌సేన‌ను చీల్చిన‌ట్టే అయింది. అంతేకాదు ఎన్‌సిసి అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు మ‌హారాష్ట్ర‌లోనే పెను స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. ప‌వార్ ప‌శ్చిమ మ‌హారాష్ట్ర స‌తారాకు చెందిన నాయ‌కులు. అక్క‌డి నుంచి వ‌చ్చిన యువ నాయ‌కుడు షిండే!

మ‌హారాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంక్‌ను మాధ‌వ్ అని తొలినాళ్ల‌లో పిలిచేవారు. మాధ‌వ్ అంటే మాధ‌వుడు కాదు. మాలి, ధ‌న‌గీర్‌, వంజారా క‌మ్యూనిటీలు. అయితే మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఓబిసీ, అర్బ‌న్ ఓట‌ర్ల‌కు బిజెపి ప్ర‌చారాలు, పిలుపులు బాగా ఆక‌ట్టుకున్నాయి. బిజెపి ప‌ట్ల మొగ్గు చూపారు. ఇక ఇపుడు ఏకంగా మ‌రాఠా రాజ‌కీయ నాయ‌కుడినే ముఖ్య‌మంత్రిని చేయ‌డం ద్వారా బిజెపి వారి దృష్టిలో మ‌హో న్నతంగా ఎదిగింది. ఇది త‌ప్ప‌కుండా వారికి 2024 ఎన్నిక‌ల్లో 32 శాతం మ‌రాఠా ఓట్లు ప‌డ‌డానికి ఎంత యినా ఉప‌క‌రిస్తుంది. 

షిండేను ముఖ్య‌మంత్రి చేయ‌డంలో ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గానికి బిజెపి చిన్న‌పాటి హెచ్చ‌రిక చేసిన‌ట్ట‌యింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయిన‌ప్ప‌టికీ మ‌హారాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌మ పార్టీవారికి కాకుండా హిందూత్వ ర‌క్ష‌ణ ఆలోచ‌న‌తోనే శివ‌సేన‌కు చెందిన షిండేకు క‌ట్ట‌బెట్టామ‌ని చెప్పుకుంటోంది. అందువ‌ల్ల పెద్ద వ్యూహ‌మే షిండేను మంత్రించింది!  2019  ముంబ‌యి  న‌గ‌ర మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కూడా బిజెపి ఎన్నిక‌ల్లో పోటీ చేయ కుండా శివ‌సేన‌కే ఆ పద‌వి ద‌క్కించుకునేందుకు వీలు క‌ల్పించింది. బిజెపి కుటుంబ‌పాల‌న‌ను తిర‌స్క రిస్తుంది. థాక్రే కుటుంబం మ‌హారాష్ట్ర‌ను ఏల‌డానికి  బిజెపీ వ‌ర్గీయుల‌కు స‌సెమీరా న‌చ్చ‌లేదు. అందుకే చిన్న స్థాయినుంచి  శివ‌సేన‌లో చెప్పుకోద‌గ్గ నాయ‌కునిగా నిలిచి ఏకంగా థాక్రేకు ఝ‌ల‌క్ ఇవ్వ‌గ‌లిగిన షిండేను ముఖ్య‌మంత్రిని చేయ‌డంలో బిజెపి ఆలోచ‌న అన‌న్య సామాన్యం. ఇదంగా 2024 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటడానికి ముంద‌స్తుగా పావుల‌ను క‌దుపుతూ  విప‌క్షాల‌కు నిద్ర లేకుండా చేయాల‌న్న వ్యూహ‌ర‌చనేై!