ఢిల్లీ ఫలితాలు.. ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ
posted on Feb 8, 2025 8:19AM

ఢిల్లీలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కల నెరవేరేలా లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కిపుపూర్తయ్యింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇంతవరకు అందిన ఫలితాల ప్రకారం బిజెపి ఆధిక్యతలలో దూసుకుపోతున్నది. ఆప్ బాగా వెనుకబడింది.
ఆ పార్టీ అగ్రనేతలు సైతం వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు వెనుకబడ్డారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు బీజేపీ 37 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా ఆప్ 26 స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. ఈ సరళి చూస్తుంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.