మ‌ళ్లీ ఫ్లెక్సీల‌ ర‌భ‌స‌

బీజేపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ర‌భ‌స మ‌ళ్లీ త‌లెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌చారానికి టీఆర్ఎస్ మీద విరుచుకుప‌డ‌ట‌మే ప్ర‌ధాన అస్త్రంగా ఉప‌యోగించుకుంటు న్నారు. ప్ర‌చారా నికి వెళ్లిన ప్ర‌తీ ప్రాంతంలోనూ, ప్ర‌తీ స‌భ‌, రోడ్‌షోలోనూ బీజేపీ నాయ‌కులు కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగా ణాను మోసం చేస్తోంద‌నే భారీ ప్ర‌చారానికి పూనుకున్నారు. విభేదాలు వ్య‌క్తం చేసుకోవ‌డానికి, తిట్టుకోవ‌డానికి  కూడా  ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను అడ్డుపెట్టు కుంటున్నారు.  టీఆర్ ఎస్ కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా పీఎం మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా త‌దిత‌రుల మీదా, ఇక్క‌డ బండి సంజ‌య్‌, కిష‌న్రెడ్డిల మీదా విరుచుకుప‌డుతున్నారు. వీలు దొరికిన‌పుడ‌ల్లా టీఆర్ ఎస్ శ్రేణులు, వీరాభి మానులు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల‌తో వెక్కిరిస్తున్నారు. ఈ త‌ర‌హా యుద్ధం క్ర‌మేపీ  ఆగ్ర‌హావేశాలతో కొట్లా ట‌కు మార‌డం ప‌రి పాటి అయింది. 

తెలంగాణాకు వ‌చ్చే కేంద్ర నాయ‌కులు, మంత్రులు, బీజేపీ సీనియ‌ర్ల‌ను ఆహ్వానించ‌డంలో కూడా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు, అభిమానులు టీఆర్ ఎస్ మీద విరుచుకుప‌డ‌టం, సెటైర్లు వేయ‌డ‌మే ఒక ప‌ద్ధ‌తిగా పెట్టుకున్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే వారిని ఈ విధంగా ఆక‌ట్టుకోవాల‌న్నదే వారి ధ్యేయంగా క‌న‌ప‌డు తోంది.

జనగామలో బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీగా ప్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ టీఆర్‌ఎస్ నేతలు  హోర్డింగ్స్ పెట్టారు. జన గామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  ఈ హోర్డింగ్స్‌లను  ఏర్పాటు చేశారు. మరోవైపు బండి సంజయ్‌కు స్వాగతం పలు కుతూ బీజేపీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా,  కొన్ని బీజేపీ ప్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించే శారు. అయితే టీఆర్ఎస్ నాయకులే చించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటాపోటీ విమర్శలు, ప్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనుంది.