అల్లు అర్జున్ కు ఊరట
posted on Jan 11, 2025 2:05PM
.webp)
సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. పుష్ప 2 సినీమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె 9ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలు కావడం తెలిసిందే. ఆ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హైకోర్టు మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆ తరువాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిలు కూడా అభించింది. కోర్టు విధించిన షరతుల మేరకు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీసు స్టుషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిపై అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్ కు హాజరు కాలేనని వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆ పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు.. ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్ కు హాజరు నుంచి అల్లు అర్జున్ కు మినహాయింపు ఇచ్చింది. అలాగే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కూడా అనుమతించింది.