వైసీపీ నేత భూమనకు షాక్
posted on Oct 21, 2025 4:01PM

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గోవుల మృతిపై ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని తిరుపతి ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయని భూమన విమర్శించారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భూమన ఆరోపించారు. భూమన చేసిన ఆరోపణలు స్థానికంగా రాజకీయ దుమారం రేపడంతోపోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.