డీఎస్పీ జయసూర్య...మంచి అధికారి : డిప్యూటీ స్పీకర్
posted on Oct 22, 2025 4:42PM
.webp)
పశ్చిమ గోదావరి భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాటను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై నేపథ్యంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారం జయసూర్య మంచి అధికారి అని కొనియాడారు. ఆయన గురించి డిప్యూటీ సీఎం పవన్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. అయితే గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం సహజమని, 13 ముక్కలాట నేరం కాదని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.
ఉండి నియోజకవర్గంలో ఎలాంటి పేకాట, జూదం లేవని చెప్పారు.
ఈ అంశంలో కూటమి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డీఎస్పీ జయసూర్య తీరుపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన పరిధిలో జూద శిబిరాలు పెరిగిపోయాయని.. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ జయసూర్య వ్యవహరించారనే ఆరోపణలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో వెంటనే భీమవరం డీఎస్పీపై శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ సందర్శంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని ఎస్పీ తెలిపారు.