బీసీ బంద్‌కు మద్దతు ప్రకటించిన కేటీఆర్

 

అక్టోబర్ 18న బీసీ సంఘాలు నిర్వహించే రాష్ట్రబంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ భ‌వ‌న్‌లో బీసీ జేఏసీ అధ్య‌క్షుడు ఆర్ కృష్ణ‌య్య‌ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ  దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు.

‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది.లోక్ సభలో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది.

 బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్‌ వెల్లడించారు. మరోవైపు బీసీ సంఘాల బంద్‌కు పెరుగుతుంది. బీజేపీ చీఫ్ రామ్‌చందర్‌రావు మద్దతు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బీసీల బంద్‌కు మద్దతు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu