బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత
posted on Nov 24, 2025 10:26AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియా ఆదివారం (నవంబర్ 23) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో భాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో జరుగుతున్న చికిత్సను అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి నిపుణులు వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కాగా బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో ఆమో చికిత్స పొందుతున్న ఆస్పత్రివర్దకు చేరుకున్నారు.