అజాద్ పార్టీ... డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ 

దేశ రాజ‌కీయాల్లోకి, ముఖ్యంగా కాశ్మీర్ రాజ‌కీయాల్లోకి మ‌రో పార్టీ ఆవిర్భ‌వించింది. చాలాకాలం కాంగ్రెస్ కొమ్ము కాసిన కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులామ్ న‌బీ అజాద్ కాంగ్రెస్‌నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. త‌మ‌ డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ ఎవ‌రి, ఏ ఇత‌ర పార్టీ ప్ర‌భావానికి అనుగుణంగా ఉండ‌ద‌ని అజాద్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 

కాంగ్రెస్‌ను వీడిన‌ప్ప‌టికీ ఆయ‌న స్వంత‌గా పార్టీ నెల‌కొల్పుతార‌ని ఊరిస్తూ వ‌చ్చారు. కాశ్మీర్‌లో త‌న అభి మానులు, మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత ఇప్ప‌టికి స్వంత పార్టీ ఏర్పాటు చేశారు. సోమ వారం మీడియా స‌మావేశంలో త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ ఎవ‌రి భావ‌జాలానికి లొంగి ప‌ని చేయద‌ని, స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. పార్టీజెండాను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు. జండా కి నిలువుగా  నీలం, తెలుపు, ప‌సుపు రంగులు ఉన్నాయి. 

కాశ్మీర్‌కు ప్ర‌త్యేక రాష్ట్ర హోదా సాధించ‌డ‌మే త‌మ పార్టీ ల‌క్ష్యంగా అజాద్ ప్ర‌క‌టించారు. పార్టీ పెడ‌తా న‌ని అంటున్నారే గాని దాని పేరు, జండాల గురించి కాశ్మీరీలు, ఇత‌ర పార్టీల‌వారూ గ‌త నెల రోజులుగా ఎదురు చూశారు. సోమ‌వారం పార్టీ పేరు, జండా కూడా ఆవిష్క‌రించ‌డంతో పాటు త‌మ పార్టీ ల‌క్ష్యాన్ని ప్ర‌జల సం క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని పార్టీ కార్య‌క‌లాపాలు ఉంటాయ‌ని అజాద్ అన్నారు. కాంగ్రెస్‌తో యాభ య్యేళ్ల అనుబంధాన్ని వ‌దులుకొని బ‌య‌ట‌ప‌డ‌గానే భారీ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ పార్టీ పేరు, జండా కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అనుగుణంగానే ఉంటుందని, వారే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు.

పార్టీ త‌ప్పకుండా కాశ్మీరీ ల నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి పెడుతుంద‌ని హామీ యిచ్చారు. త్వ‌ర‌లో రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న కార‌ణంగా త‌మ‌పార్టీ కార్యాల‌యం ఇక్క‌డే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలి పారు. కాంగ్రెస్‌తో త‌మ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, పార్టీలో ఇపుడు ప‌రిస్థితులు ఎంతో మారి పోయాయ‌ని అన్నారు. రాహుల్ పార్టీ బాధ్య‌త‌లు మోసేంత శ‌క్తిమంతుడు కాద‌ని అన్నారు.