ఆవుల నోరు విప్పాడు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిర‌సిస్తూ దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అల్ల‌ర్లు చెల‌రేగిన  సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్‌లో జ‌రిగిన అల్ల‌ర్లు, రైలు ద‌గ్ధం కేసులో అనేక విష‌యాలు వెలుగు చూస్తు న్నాయి. సికింద్రాబాద్‌లో ఎ న్న‌డూ వూహించ‌ని దాడులు, అల్ల‌ర్ల‌కు యువ‌త‌ను రెచ్చ‌గొట్టార‌ని సాయి డిఫె న్స్ అకాడెమీ య‌జ‌మాని ఆవుల సుబ్బారావును అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్సు పోలీసుల విచార‌ణలో ఆవుల దాడుల వెనుక కుట్ర గురించి నోరు విప్పాడు.  ఆవుల త‌న అనుచ‌రుల‌తోనే ధ్వంస ర‌చ‌న చేసిన‌ట్టు విచార ణ‌లో తేలింది. 

అస‌లు ఈ ఆందోళ‌నకు గుంటూరు ర్యాలీ స‌మ‌యంలోనే స్కెచ్ వేసిన‌ట్టు తేలింది. సుబ్బారావు అనుచరు ల‌కు వాట్సాప్ గ్రూప్‌లలో పిలుపునిచ్చారు. న‌రేష్ అనే అనుచ‌రుడితో సుబ్బారావు ఆందోళ‌న‌కారుల‌కు కావ ల‌సిన భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేయించాడు. కాగా న‌రేష్ ప్ర‌స్తుతం ప‌రారీలో వున్నాడు. జూన్ 16నే సుబ్బారావు సికింద్రాబాద్‌కు వ‌చ్చి హోట‌ల్లో అనుచ‌రుల‌తో భేటీ అయ్యాడు. విధ్వంసానికి  సిద్ధ‌మయ్యారు. విధ్వంసం జ‌రిగిన వెంట‌నే సుబ్బారావు ను పోలీసులు రిమాండ్‌కి త‌ర‌లించారు. 

ఇదిలా ఉండగా, సాయి డిఫెన్స్ అకాడమీకి ఆర్‌పీఎఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్‌పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన రికార్డులు,  ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావా లని సూచించారు.