మోడీ హెలికాప్టర్ కు నో పర్మిషన్

ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ హెలికాప్టర్ కే ఏవియేషన్ అధికారలు అనుమతి ఇవ్వలేదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగి వేళ్లేందుకు బేగంపేట విమానాశ్రాయానికి బయలు దేరారు. అయితే ఆయన హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఆయన ఐఎస్ బీ నుంచి బేగం పేట విమానాశ్రయం వరకూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం గుండా ప్రయాణించి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు.

అక్కడి నుంచి విమానంలో చెన్నైకు బయలు దేరి వెళ్లారు. ఇంతకీ ఏవియేషన్ అధికారులు మోడీ చాపర్ కు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే.. ఆయన బయలు దేరు సమయానికి ఆకాశం మేఘావృతమై బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి.

నగరంలో పలు చోట్ల వర్షం కూడా పడింది. దీంతో అటువంటి వాతావరణంలో చాపర్ ప్రయాణం సేఫ్ కాదని భావించిన ఏవియేషన్ అధికారులు ప్రధాని హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించారు.