Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇఎన్సీ మోహన్ నాయక్ చిట్టా.. 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసిబి
posted on: Jun 9, 2026 3:25PM

ఏసీబీ దాడుల్లో ఇఎన్‌సి మోహన్ నాయక్‌కు సంబంధించిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయనకు సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఆస్తుల పరంగా చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములు కూడా ఆయన పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతా ల్లో ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఆస్తులు ఎలా సంపాదించారు.
ఆదాయానికి మించిన ఆస్తులా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో మొత్తం ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రోడ్డు భవనాల శాఖ ఇఎన్‌సి గా పని చేస్తున్న మోహన్ నాయక్ పై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి మంగళవారం (జూన్ 9) తెల్లవారుజాము నుండే ఏకకాలంలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఇప్పటివరకు మోహన్ నాయక్ 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంకా సోదాలు కొన సాగుతూ ఉన్నాయి.



.webp)


