బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. మొత్తం ఆరు కత్తిపోట్లు ఉండగా, వాటిలో రెండు చాలా లోతుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆయన వెన్నుముక వద్ద లోతైన గాయం అయ్యిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందనీ పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం (జనవరి 16) తెల్లవారు జామున జరిగింది. 

సైఫ్ అలీఖాన్ నివాసంలోకి జొరబడిన అగంగకుడు చోరీ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. అతడిని గమనించి అలీఖాన్ ఇంటి నౌకర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుండగుడు నౌకరుతో గొడవకు దిగాడు. ఈ అలికిడికి నిద్ర నుంచి లేచిన అలీఖాన్ ఆ అగంతకుడిని అడ్డుకోబోగా అతడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్నపోలీసులు సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన దుండగుడిని పట్లుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.   దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సైఫ్ అలీఖాన్ పై దాడి సంఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu