కన్నకూతురే ఆ ఆర్టిస్ట్‌కి న్యూడ్ మోడల్
posted on Jan 17, 2015 9:57AM

ప్రపంచ వ్యాప్తంగా న్యూడ్ ఆర్ట్‌లు వేసే కళాకారులు చాలామంది వున్నారు. అనాది కాలం నుంచీ న్యూడ్ ఆర్ట్‌లు వేసేవారు ఒక మోడల్ ఆధారంగా తమ బొమ్మలు వేస్తారు. న్యూడ్ బొమ్మలు వేసే ఆర్టిస్టుల కోసం మోడల్‌గా వ్యవహరించే స్త్రీలు ఎంతోమంది వున్నారు. ఇది ఎంతమాత్రం అభ్యంతరకరమైన విషయం కాదు. అయితే చైనాలో ఒక ఆర్టిస్టు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా అభ్యంతరకరంగా వుంది. చాలా వివాదాస్పందంగా కూడా మారింది. నగ్న చిత్రాలు వేసే ఈ ఆర్టిస్టు తనకు మోడల్‌లో వేరే ఎవరినో పెట్టుకోకుండా తన కూతుర్నే మోడల్‌గా చేసుకుని నగ్న చిత్రాలు గీస్తున్నాడు. బీజింగ్‌కి చెందిన లీ జువాంగ్ జిన్‌పింగ్ అనే ఆర్టిస్టు గీసే నగ్న చిత్రాలకు మంచి ఆదరణ వుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయన తన కుమార్తె లీ కిన్‌ని నగ్న మోడల్‌గా పెట్టుకుని నగ్న చిత్రాలు గీశాడు. ఆ చిత్రాలన్నిటికీ Oriental Goddess and Mountain spirit పేరుతో ప్రదర్శనలో కూడా పెట్టాడు. ఈ చిత్రాలు చైనాలోని నగ్న చిత్రకళా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే విమర్శకులు మాత్రం ఈ చిత్రాల మీద విరుచుకుపడుతున్నారు. కన్నతండ్రి తన కూతురి నగ్న చిత్రాలను గీయడం దారుణమని అంటున్నారు. ఈ చిత్రాలను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్లను సదరు ఆర్టిస్టు, ఆయన కుమార్తె లైట్‌గా తీసుకుంటున్నారు. మాకులేని అభ్యంతరం విమర్శకులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.