మోడీ భీవవరం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరం రానున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం దాదాపు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయిందా అన్నట్లు ఏర్పాట్లు ఉన్నాయి. రేవుకాళ్ల మండలం నుంచి భీమవరం వైపు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు.

సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి బయలు దేరి 10.10 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 10.55 గంటలకు భీమవరం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

సభలో జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 12.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.