Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యాపిల్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు.. పునరుద్ధరణ.. అసలేంజరిగిందంటే?
posted on: Aug 4, 2026 10:23AM

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. టెక్ దిగ్గజం యాపిల్ తన అధికారిక యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించింది. ఇది వెంటనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సోమవారం (ఆగస్టు3) పలు దేశాల్లోని ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు యాప్ స్టోర్‌లో టెలిగ్రామ్ లేకపోవడంతో యూజర్లలో ఆందోళన వ్యక్తమైంది.
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది. వినియోగదారుల డిజిటల్ భద్రత, చైల్డ్ సేఫ్టీ విధానాల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన యాపిల్.. తక్షణమే టెలిగ్రామ్ ను తమ స్టోర్ నుంచి తొలగించింది.
ఈ వ్యవహారంపై బ్లూమ్‌బర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్.. యాపిల్ అధికారిక ప్రకటనను షేర్ చేస్తూ వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ లో ప్రత్యక్షం కావడం వల్లే.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాపిల్ స్పష్టం చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన టెలిగ్రామ్ యాజమాన్యం వివాదాస్పద కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుండి పూర్తిగా డిలీట్ చేయడమే కాకుండా.. ఆ తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడిన నిర్దిష్ట యూజర్ ఖాతాను, సంబంధిత ఛానెల్‌ను పర్మినెంట్ గా బ్యాన్ చేసింది. టెలిగ్రామ్ తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందిన యాపిల్ టెలిగ్రామ్ ను యాప్ స్టోర్‌లో పునరుద్ధరించింది.
Apple bans Telegram, Telegram restored, Child abuse content controversy, Telegram dark web India, Mark Gurman Bloomberg


.webp)



