Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాన్ రాజీనామా.. ఆప్ విద్యామంత్రికీ ఎసరు?
posted on: Jul 28, 2026 12:18PM

నీట్ పేపర్ లీకేజీల నిరసనల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టింది. నీట్ లీకేజీకి నిరసనగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హస్తిన వేదికగా జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన్ మస్ట్ గో’ అంటూ ప్రచారం చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆపార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాలు జంతర్ మంతర్ కు వెళ్లి మరీ కాక్రోచ్ ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించారు. ఆ సందర్భంగా ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఇప్పటి వరకూఅంటే గత నాలుగున్నర ఏళ్లుగా ఒక్క పేపర్ లీక్ అవ్వలేదని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, ఒక వేళ అలా లీక్ అయి ఉంటే పంజాబ్ విద్ాయమత్రి చేత రాజీనామా చేయించి ఉండేవారమని సవాల్ చేశారు.
ఆ సవాలే ఇప్పుడు ఆప్ విద్యామంత్రి పదవికి ఎసరు తెచ్చింది. మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు. ఇటీవల ఫరీద్‌కోట్‌లో జరిగిన 454 ఫార్మసిస్ట్ పోస్టుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న హైటెక్ కాపీయింగ్ వ్యవహారం పంజాబ్‌లో పెద్ద కలకలం రేపిన సంగతి విదితమే. అభ్యర్థులు పెన్ కెమెరాల ద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపి, వైర్‌లెస్ పరికరాల ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 3.5 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది.
అలాగే ఫిబ్రవరి 2023లో.. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ప్రారంభానికి ముందు లీక్ కావడంతో ఆ పరీక్షను అత్యవసరంగా రద్దు చేశారు. ఇవే కాకుండా, నైబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్, పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష , అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పిఎస్‌ఎస్‌ఎస్‌బి గ్రూప్-బి పరీక్షలలో కూడా కుంభకోణాలు బయటపడ్డాయి.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నీతికి కట్టుబడి పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ కూడా తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్, అకాలీదళ్ నాయకురాలు హ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన్ మస్ట్ గో’ ఉద్యమం కాస్తా పంజాబ్‌లో బేన్స్ రాజీనామా’ డిమాండ్ కు దారి తీసింది. చూడాలి మరి ఇప్పుడు ఆప్ ఏ విధంగా స్పందిస్తుందో?
Harjot Singh Bains, Manish Sisodia Challenge, Punjab Paper Leak Scam, Dharmendra Pradhan Resignation, Punjab Elections


.webp)



