పెట్టుబడుల రాకతో ఏపీ ఆదాయానికి బూస్ట్
posted on Oct 13, 2025 6:06AM

ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందా అంటే.. పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులూ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. ఆ కారణంగానే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానికి పరిశ్రమలు.. ఇలా ఒకటనేమిటి.. పలు పరిశ్రమలు ఏపీలో అడుగుపెడుతున్నాయి పెట్టుబడులు, పరిశ్రమల రాకవల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందులో సందేహం లేదు.
కానీ ఆ ప్రయోజనం అంతటితో ఆగదు.. పెట్టుబడుల రాకవల్ల రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతోంది. ఈ పెట్టుబడుల్లో 30శాతం పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయానికి జమ అవుతుంది.రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటాసెంటర్ రాకతో ఏపీకి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం వస్తుంది.
అలాగే ఇతర పరిశ్రమల రాకవల్ల కూడా. అందుకోసమే.. రాష్ట్రంలోకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ కూడా తమ తమరాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి ప్రోత్సహకాలు ఇస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకే పారిశ్రమిక వేత్తలు ఆసక్తి చూపడానికి కారణమేంటంటే.. ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబుపై విశ్వసనీయత, పారిశ్రామిక అబివృద్ధికి దోహదపడటంలో ఆయనకు ఉన్న విశ్వసనీయత కారణంగా చెప్పవచ్చు.
ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన తరువాత.. మొత్తం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు ఆ నగరమే కావడమే. ఇక అనంతపురంలో కియా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, నిరంతరాయంగా వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రాయతీల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ ఆదాయం ఉంటుంది. తమ ఉత్తత్తులపై పన్నులు, ఇతర పన్నులు అన్నీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేవే. అందుకే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, గుడ్ విల్ కారణంగా పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నారు.