Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాలుగు నామినేషన్లూ సక్రమమే!
posted on: Jun 9, 2026 3:35PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం (జూన్ 9) అధికారికంగా పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 18 న జరగబోయే ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరి పత్రాలు చెల్లుబాటు కావడంతో తదుపరి ప్రక్రియకు మార్గం సుగమమైంది.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నలుగురు ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
అదేవిధంగా, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కోటా కింద ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలకు గానూ కూటమి తరఫున ఈ నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. దీంతొ ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక కగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.





