బస్సు భద్రతా చట్టం.. గడ్కరీని కోరిన మంత్రి టీజీ భరత్

దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా, భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చ‌ర్చించిన‌ట్లు మంత్రి భరత్ తెలిపారు.  ఎంపీ బ‌స్తిపాటి నాగ‌రాజుతో క‌లిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన  ఇటీవ‌లి కాలంలో తరచుగా జరుగుతున్న బస్సుప్రమాదాలు, వాటిలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు మరణాల విషయాన్నిప్రస్తావించారు.  

క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరు స‌మీపంలో బస్సు ప్ర‌మాదంలో మంట‌ల్లో చిక్కుకొని ప్ర‌యాణికులు చ‌నిపోయారు. అధునాతన అగ్నిమాపక వ్యవస్థలపై  తాను గతంలో ఇచ్చిన వినతి మేరకు కొత్త‌ ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురావాలని భరత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తన వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు టీజీ భరత్ చెప్పారు.

 గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి పెద్దటేకూరు వరకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న హైవే లైటింగ్ గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి  తీసుకువెళ్లానన్నారు. అదే విధంగా కర్నూలు-బళ్లారి జాతీయ రహదారి ప్రతిపాదనతో సహా ముఖ్యమైన ప్రాంతీయ రహదారి అనుసంధాన అవసరాలను వివ‌రించిన‌ట్లు చెప్పారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu