TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ..!

Published on: Fri Aug 28, 2026 1:03PM

 

జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు  ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో  నాగబాబు తన సతీమణి  పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు  నాగబాబుకి వేద ఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా  నాగబాబుకి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.

 

 

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన  నాగబాబుని పీసీసీఎఫ్  పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే,  అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు  వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్  రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్  బి.ఎన్.ఎన్. మూర్తి , పంచాయతీరాజ్ కమిషనర్  కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో ఛైర్మన్  వేములపాటి అజయ కుమార్  మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 AP Green Executive Committee Chairman Nagababu, AP Green Society, CM Chandrababu, Deputy cm Pawan kalyan, Janasena party, Telugu news, Telugu One