గూగుల్ లో ఏపీ సర్కార్ హిస్టారికల్ అగ్రిమెంట్

సీబీఎన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ డీల్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసే గేమ్  చేంజర్ లాంటి చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఆ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటేనే అభివృద్ధి.. ఆయన హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ   ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ వరకూ ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చారు. ఎన్నో సంస్థలు, పరిశ్రమల రాకకు కారకుడయ్యారు. అయితే  ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆయన సమక్షంలో గూగుల్ తో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందం మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ లోనే అత్యంత భారీ ఒప్పందంగా చెప్పవచ్చు.  

గూగుల్ సహ సంస్థ అయిన రైడైన్ లో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఈ  ఒప్పందం విలువ రమారమి 90 వేల కోట్ల రూపాయలు. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే. గూగుల్ విశాఖలో  దేశంలోనే  అతిపెద్ద డేటా కేంద్రం ప్రారంభంచనుంది.  ఇంకో విశేషమేంటంటే.. గూగుల్ హిస్టరీలో కూడా భారత్ లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. అంటే ఎలా చూసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఇన్వెస్ట్ మెంట్ ఒక కొత్త రికార్డు అని చెప్పారు. కాగా గూగుల్    డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖ‌ప‌ట్నం  డేటాసెంటర్‌ హబ్‌ గా మారుతుంది.  ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్  ల సహకారం ఉందని చంద్రబాబు తెలిపారు.  

ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం (అక్టోబర్ 14) ఉదయం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇదే అతిపెద్దది. 

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబర్‌లో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030 మధ్య) ఈ పెట్టుబడి పెట్టనుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu