ఆన్‌లైన్‌లో రుణమాఫీ జాబితా
posted on Dec 8, 2014 3:55PM

రైతుల రుణమాఫీ జాబితాని ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పెట్టింది. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో http://apcbsportal.ap.gov.in/loanstatus అడ్రస్‌లో పెట్టింది. 50 వేల లోపు రుణాలున్న రైతుల జాబితాను ఇందులో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎవరి ఖాతాకు చెందిన వివరాలు వారు చూసుకునే విధంగా ప్రభుత్వం ఈ జాబితాను రూపొందించింది. పంట రుణాల మాఫీకి అర్హులైన 40.43 లక్షల మంది రైతుల ఖాతాల వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఉంచింది. రైతు రేషన్‌కార్డు, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా సంఖ్య, పట్టాభూమి నంబర్లు, భూ విస్తీర్ణం, రైతు చిరునామా, లోన్ తీసుకున్న బ్యాంకు, శాఖ, ఎప్పుడు, ఎంత మొత్తం రుణం తీసుకున్నారు.. ఏ పంట వేశారు.. ఎకరానికి ఆ పంటకున్న పరపతి ఎంత.. మొత్తం మాఫీ ఎంత.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం ప్రభుత్వం ఇస్తోందన్న సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.