మిలియన్ మార్చ్ కు ఉద్యోగుల సమాయత్తం.. అణచివేతకు ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన  సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు ఈ మిలియన్ మార్చ్ చేస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.అందుకు భిన్నంగా అవగాహన లేకుండా  లేకుండా హామీ ఇచ్చానని చెబుతున్నారు.

దీంతో ప్రభుత్వంపై పోరుబాటే శరణ్యమని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న  సీపీఎస్ ఉద్యోగులు, మరీ   సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను  గట్టిగా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సహజంగానే టీచర్ల నిరసనకు  ప్రభుత్వ అనుమతి ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం ఉండవు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని టీచర్లు తమ నిరసనను ఆపే అవకాశాలూ లేవు.

 గతంలో చలో విజయవాడను నిరోధించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వివఫలమైన సంగతి తెలిసిందే. పీఆర్సీ విషయంలో తమను మోసం  చేసిందని ఉద్యోగులు తీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సెప్పెంబర్ 1న మిలియన్ మార్చ్ కోసం రోడ్డెక్కితే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. ఒక వేళ ఉద్యోగుల మిలియన్ మార్చ్ విజయవంతమైతే ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న అన్ని వర్గాలూ పోరుబాట పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే సెప్టెంబర్ మిలియన్ మార్చ్ ను నిర్వీర్యం చేయాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం కూడా పట్టుదలలకు పోతుండటంతో మిలియన్ మార్చ్ సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.