ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. కోర్టు వరుస సెలవుల్లోస్కెచ్ 

కరోనా కల్లోలంలోనూ  ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబెల్  రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నీరు ఏపీ పోలీసులు. ఐపి సి 124B సెక్షన్ కింద రఘురామ రాజుపై కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు మోపారు. ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.  రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది సీఆర్పీఎఫ్ సిబ్బంది. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు  సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ఆయన్ను విజయవాడకు తరలించారు. 

ఏపీ సీఐడీ పోలీసులు  పక్క ప్లాన్ తో నే రఘురామకృష్ణం రాజు అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది.కొంత  కాలంగా ఏపీ సర్కార్ వైఫల్యాలను ఎండ గడుతున్నారు రఘురామ కృష్ణం రాజు. రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు యూట్యూబ్ లైవ్ లో ప్రభుత్వం కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయినట్లుగా రాజు మాట్లాడేవారు.దీంతో తమకు తలనొప్పిగా మారిన  రఘురామకృష్ణం రాజును cid అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.  

ఈ రోజు ఫ్రైడే రంజాన్ కావటంతో కోర్టులకు సెలవు.శనివారం కూడా హాలీడేనే. మరుసటిరోజు ఆదివారం. అంటే 3 రోజులు వరుసగా కోర్టుకు సెలువులు రావడంతో.. అదను చూసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజును కచ్చితంగా మూడు రోజులు జైలులో ఉంచవచ్చనే కారణంతో పక్కాగా స్కెచ్ వేసి శుక్రవారం సాయంత్రం రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ చేశారు.  సోమవారం రాజు కి సంబంధించిన  లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయవచ్చు. అయితే కేసు గ్రావిటీ ఎంత?... నిలబడుతుందా లేదా అనే విషయాన్ని ప్రక్కకు పెడితే రఘురామను మూడు రోజులు జైలులో ఉంచేలా జగన్ రెడ్డి సర్కార్ ఆదేశాలతో ap cid తమ ప్లాన్ అమలు చేశారు.