అంతర్జాతీయ స్థాయికి ఏపీ అక్వా..!

ఆంధ్రప్రదేశ్ లో అక్వా సాగును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా కుదేలైన ఆక్వారంగానికి జవసత్వాలు వచ్చేలా ఏపీ రొయ్యలను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేలా ఒప్పందం కుదిర్చిన నారా లోకేష్ ఇప్పుడు ఆక్వాసాగులో అత్యాధునిక పద్ధతులను తీసుకువచ్చేందుకు ఆ రంగంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ తో లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఉష్ణమండల ఆక్వాసాగులో ముఖ్యమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలలో నిష్ణాతుడైన  జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (సీఎస్ టీఎఫ్ఏ) విభాగాధిపతి జెంజర్ తో చర్చల సందర్భంగా  ఏపీలో రొయ్యల సాగు సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎస్టీఎఫ్ఏ  ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను రాష్ట్ర రైతులకు అందించాలని కోరారు. భారత్‌లో ప్రధానంగా ఉత్పత్తి అయ్యే ఆక్వా రకాలలో   బ్లాక్ టైగర్ రొయ్యలలో వ్యాధి నిరోధకత, వృద్ధిరేటును పెంచడానికి జన్యుపరమైన మెరుగుదలకు అవసరమైన సహకారం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేలా వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ అప్టిమైజేషన్ వంటి పద్ధతులకు ప్రోత్సాహం అందించడంపై జెంజర్ అవసరమైన మద్దతు అందిస్తారు.  ఇక పోతే ఏపీ అక్వా రైతులకు   ఆధునిక సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని లోకేష్ ఈ సందర్భంగా జెంజర్ ను కోరారు.

అలాగే ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు  అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు. ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా  జెంజర్‌ను కోరారు. మొత్తంగా ఈ భేటీ ద్వారా ఏపీ అక్వా సాగులో నాణ్యత, ఉత్పాదకతపెంపొందించేందుకు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, ఆధునిక సాంకేతికతను వినియో గించుకోవడానికి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu