దీని భావమేమి జగనేశా.. ఓవర్సీస్ విద్యానిథి పథకానికి అంబేడ్కర్ పేరు మార్పుపై ఆగ్రహం

పిల్లాడికి ముచ్చ‌ట‌ప‌డి పేరు పెడ‌తారు పెద్ద‌వాళ్లంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి. దానికి ముందో వెన‌కో ఆధుని క‌త్వం జోడిస్తూ మంచి పేరు పెట్టడానికే ప్ర‌య‌త్నిస్తారు. కుద‌ర‌క‌పోతే  లోకంలో స‌ర్వ‌సాధార‌ణ మైన బాబీ, నిమ్మీ, విన్నూ.. ఎలాగూ ఉంటాయి.  పేరు  మార్చ‌డం, అలాగే ఉంచ‌డం త‌ల్లిదండ్రుల యి ష్టం. కానీ ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కానికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మారుస్తానంటే ఎలా కుదురుతుంది? అదేమ‌న్నా స్వ‌ంత వ్య‌వహార‌మా. జగన్ సర్కార్ అంబేడ్కర్ విద్యానిథికి ప‌థ‌కానికి పేరు మార్చ‌డం సర్వత్రా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఇది  ఒక్క‌టే కాదు ఆంధ్రాలో కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ జిల్లా అని పేరు మార్చ‌డమూ అంతే వ్య‌తిరేక‌త‌కు గుర‌యింది. కోన‌సీమ అనేది ఆనాదిగా రాష్ట్రంలో అంద‌రికీ తెలి సిన ప్రాంతం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జగన్ సర్కార్ కోనసీమను జిల్లాగా చేసింది. కొనసీమ జిల్లాగా పేరు ప్రకటించి ఆ తరువాత దానిని అంబేద్క‌ర్ కోన‌సీమ  జిల్లా అని మార్చ‌డంతో ఒక్కసారిగా కోనసీమ భగ్గుమంది.

అంబేద్క‌ర్ విద్యానిధి ప‌థ‌కం వాస్త‌వానికి ఎంద‌రో విద్యార్ధుల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది.  గత  టీడీపీ ప్రభు త్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్ డి,  ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకు నేందుకు రూ. 15 లక్షల చొప్పు న ఆర్థిక సహాయం అం దించామని ఆయన తెలిపారు. దీనివ‌ల్ల ఎంద‌రికో ల‌బ్ధి చేకూ రుతుంది. దీన్ని గురించి విప‌క్షాలూ మండి ప‌డుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు  ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఈ పథకానికి జగన్ తన పేరును చేర్చుకోవడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరుని తొలగించడం ఆయనను అవమానించినట్టేనని చంద్రబాబు అన్నారు. ఇది జగన్ అహంకారమని విమ ర్శించారు. అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించడమేనని చెప్పారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ డి మాండ్ చేస్తోందని అన్నారు.

అలాగే ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థు ల కైతే రూ.15 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నా రు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగు దేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైఎస్సార్ సీపీ ప్రభు త్వం.. ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" పేరు నుంచి అంబేద్కర్ పేరును తొల గిం చింది అన్నారు.

ఇదిలాఉండ‌గా, కోన‌సీమను అదే పేరుతో జిల్లా చేసి ఇప్పుడు హ‌ఠాత్తుగా దాని పేరు అంబేద్క‌ర్ జిల్లాగా మార్చ‌డం విష‌యంలోనూ ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అనాదిగా కోనసీమ ప్రాంతీయులు త‌మ ప్రాంతాన్ని అలానే పిల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ్డారు. అదే పేరున జిల్లా ఏర్పాటును అంగీక‌రించారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోన‌సీమ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మార్చ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌న్నది ప్ర‌శ్నిస్తు న్నారు. వాస్త‌వానికి ఆ ప్రాంతీయుల‌కు అంబేద్క‌ర్ ప‌ట్ల ఎంతో గౌర‌వం ఉంది. గాంధీతో స‌మానంగా అంబే ద్క‌ర్ ప‌ట్ల నిత్య అభిమానాన్ని ప్ర‌క‌టిస్తూనే ఉంటారు. 

కానీ జిల్లా పేరును ఇపుడు మార్చే బ‌దులు అస‌లు ముందే అంబేద్క‌ర్ అని పెట్టి ఉంటే అక్క‌డి ప్ర‌జ‌ల నుంచీ ఎటువంటి వ్య‌తిరేక‌తా వ‌చ్చేది కాదు. ఇపుడు జ‌గ‌న్ త‌న‌కు తోచిన‌విధంగా, ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయ ప‌రంగా, ఓట్ల‌ప‌రంగా చూస్తూ అంబేద్కర్ జిల్లా అని పేరు మార్చ‌డం జ‌రిగింద‌న్న అభిప్రాయాలే వెల్లు వెత్తుతున్నాయి. ఈ ప‌రంగా ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టాన్ని అగౌర వ‌రుస్తూ తీసుకునే నిర్ణ‌యాలను అంగీక రించేందుకు సిద్ధంగా లేర‌నే అభిప్రాయాలు విన‌వ‌స్తున్నాయి.