హెర్డ్ బాపూ బొమ్మే కాదు.. గ్రీకు శిల్పం!

అందం అంటే కోటేరులాంటి ముక్కు,  కోల క‌ళ్లు,  దొండ‌ పండు లాంటి పెదాల‌తో ఆక‌ట్టునేదే అస‌లు సిస‌ల అందం. అలాగ‌ని క‌వులు, సినీ క‌వులు ప‌ద్యాలు, పాట‌ల్లో చెప్పి, వినిపించి మ‌న‌సులో ఇంకేట్టు చేసేరు. అప్పుడు, ఇప్పుడు, ఇక ముందూ యువ‌త అదే సూత్రాన్ని అమ్మాయిలను చూడ్డంలో లెక్క‌లేసుకుంటారు.  అమ్మాయి అన‌గానే బాపు బొమ్మ అనే గొప్ప సూత్రం చాలా కాలం నుంచి తెలుగు నాట సుప్ర‌సిద్ధం. కానీ ఇంగ్లీషువారి లెక్క వేరే వుంద‌ట‌! అందంతో ఆక‌ట్టుకోవ‌డం, హుందాగా ఆక‌ర్షించ‌డం విషయంలో ఈ మ‌ధ్య  లోకంలో చాలా మంది  సందిగ్ధ‌త‌కే  గుర‌వుతు న్నారు.

నిజానికి ప‌ర్‌ఫెక్ట్‌నెస్ అంటూ మ‌నిషిని నిర్ధారించే సూత్రాలు అర్ధం లేనివ‌నే వాద‌నా వుంది. మ‌నిషి చ‌క్క‌గా క‌న‌ప‌డ‌టం మీద అర్ధాలు చాలామంది చాలా ర‌కాలుగా చెబుతుంటారు. మ‌నిషిలో స‌హ‌జ అందం అంటూ  ఒక‌టి వుంటుంది. దాన్నే లెక్క‌లోకి తీసుకోవాల‌నే వారి వాద‌న‌కూ బ‌లం వుంది. ఈ  రోజుల్లో అందం మీద చాలా అస‌క్తి  క‌న‌ప‌రుస్తున్నారు. యువ‌త మీద  సినీ న‌టుల ప్ర‌భావం చాలా ఎక్కువగా ఉంది. 

ఎలాగూ సినీన‌టుల గురించిన మాట వ‌చ్చింది గ‌నుక  హాలీవుడ్ న‌టుడు జానీ డెప్‌, అత‌ని భార్య ఆంబ‌ర్ హెర్డ్ మ‌ధ్య ఇటీవ‌ల  ఆమె అందం విష‌యంలో వివాదం త‌లెత్తింది.  ఈ వివాదంతో అస‌లు అందానికి ప్రాచీన గ్రీకు గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ల  ఫార్ములా అంటూ ఒక‌టి వుంద‌న్న సంగ‌తి ఇప్ప‌టి వారికి  స్ప‌ష్ట‌మ‌యింది. పాత సినిమాలు చూసినా,  ప్రాచీన నాగ‌రిక‌త‌కు చెందిన‌వారిని గురించి విన్న‌పుడు గ్రీకుల కంటే అంద‌మయిన‌వారు  లోకంలో వుండ‌రన్న భావ‌న  ఇప్ప‌టికీ వుంది.

ఇపుడు  ఆనాటి  లెక్క‌ల విషయం ఎందుకు వ‌చ్చింది?  హెర్డ్‌, డెప్ ల మ‌ధ్య అందం విష‌యంలో వ‌చ్చిన గొడ‌వ కోర్టు  దాకా వెళ్లింది. డెప్ త‌న‌ను అవ‌మానించినందుకు హెర్డ్ అత‌ని మీద ఏకంగా 15 మిలియ‌న్ డాల‌ర్ల  ప‌రువు న‌ష్టం దావా వేసింది! ఇది చాలా చిత్రంగా వుంద‌నుకున్నారు చాలామంది. అస‌లు నిలిచే  కేసే కాద‌న్నారు. పైగా డెప్ కి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఆమె కెరీర్ దెబ్బ‌తిన్న‌ద‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత గోల జ‌రుగుతుంటే, మ‌రోవంక  అమెరికా న‌టి  36 ఏళ్ల హెర్డ్ ముఖం ప్రాచీన గ్రీకు గ‌ణిత శాస్త్ర‌వేత్త‌లు చెప్పి న  గోల్డెన్ రేషియో సూత్రం ప్ర‌కారం చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా వుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు.

మ‌నిషి ముఖంలో క‌ళ్లు, ముక్కు ఏ లెక్క‌లో స‌రిగా వుండాల‌న్న‌ది తెలియ‌జేసేది గోల్డెన్ రేషియో ట‌!  బ్రిటిష్ కాస్మాటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ జూలియ‌న్ డి సిల్వా ఏమ‌న్నారంటే.. అమెరికా న‌టి హెర్డ్ ముఖం గోల్డెన్ రేషియోలో చెప్పిన‌దానికి  దాదాపు 91.85 శాతం ద‌గ్గ‌ర‌గా వుంది. అదీ ఏదో చ‌క్క‌గా, అందంగా క‌న‌ప‌డుతోం ద‌ని కాదు ఏకంగా అందుకు డిజిట‌ల్ ఫేషియ‌ల్ మ్యాపింగ్ సాంకేతికత‌ను ఉప‌యోగించి తేల్చార‌ట‌.  ముఖ్యంగా మ‌నిషి క‌ళ్లు ఎంత చ‌క్క‌గా వున్న‌దీ తేల్చిచెబుతుంది ఈ టెక్నాల‌జీ. దీన్నే పూర్వం  గ్రీక్ అక్ష‌రం  ఫి తో సూచించేవార‌ట‌! 2016లోనే  హెర్డ్ ముఖానిని  ఈ సాంకేతిక‌త‌తో  కొలిచిన‌ట్టు  డాక్ట‌ర్ సిల్వా తెలిసారు. అంటే క‌ళ్లు, ముక్కు, పెదాలు, చుబుకం మ‌ధ్య వుండాల్సిన దూరాన్ని కొలిచి చూశార‌ట‌. మొత్తం మీద ఆ కొల‌త‌ల ఫ‌లితాలు గోల్డెన్ రేషియో సూత్రానికి  92 శాతం ద‌గ్గ‌ర‌లో వున్నందున ఆమె నిజంగానే అంద‌గ‌త్తె కింద ప్ర‌క‌టించారు.  ఇలా ఖ‌చ్చిత‌మైన లెక్క‌గా అవ‌య‌వాలు  క‌లిగి వున్న మ‌హిళ‌గా  ప్ర‌పం చంలో కెల్లా అంద‌మయిన మ‌హిళ‌గానూ హెర్డ్ కితాబు  అందుకుంది.