అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

 

అమెజాన్‌ సంస్థకు కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్‌లో  రూ.80వేలు చెల్లించి  ఐ ఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టగా..ఐ ఫోన్ 15ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయ్యిందని బాధితుడు వీరేష్  పేర్కొన్నాడు. పలు మార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో బాధితుడు జిల్లా కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. 

దీంతో బాధితుడికి ఐ ఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు  రీఫండ్ చేసి రూ. 25 వేలు బాధితుడికి  చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 21కు వాయిదా వేసింది.గతంలో ఎన్నడు లేని విధంగా ఈ పండుగ సీజన్‌లలో ఆన్ లైన్ కష్టమర్లకు ఉహించని షాక్ లు తగిలాయి. తాము ఆర్డర్ చేసిన వస్తువలకు బదులు ఇతర వస్తువులు, నకిలీ వస్తువులు పెద్ద మొత్తంలో రావడం సంచలనంగా మారుతున్నాయి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu