నేను గ‌ర్ల్ కాదు.. బాయ్‌!

కుటుంబాలు పిల్ల‌ల విష‌యంలో చిత్ర‌మైన ఆలోచ‌న‌ల‌తో ఉంటారు. కొడుక్కి కొడుకే పుట్టాల‌ని, కూతురు ఇంటికి భార‌మ‌ని. ఇది ప‌ర‌మ పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి భావ‌న‌. కానీ దుర‌దృష్ట‌వశాత్తూ చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే అదే ధోర‌ణిలో త‌ల్లిదండ్రులు ఉన్నారు. చ‌దువుకుని మంచి ఉద్యోగంలో స్థిర‌ప‌డితే పెళ్లి స‌మ యంలో అన్నీ అదే స‌ర్దుకుపోతాయ‌న్న భావ‌న‌కు ఆధునిక త‌ల్లిదండ్రులు పాత సిద్ధాంతాల్ని కొట్టి పారే స్తున్నారు. ఆడ‌పిల్ల కావాల‌నుకునేవారు మ‌గ‌పిల్ల‌ల‌కు చిన్న‌పుడు పిలక‌లు వేయ‌డం, బొట్టుపెట్టి వీల‌యి తే ఓ గౌనూ తొడిగి వారి స‌ర‌దా తీర్చుకుంటారు. అదో ఆనందం. ఇంట్లో ఆడ‌పిల్ల ఉంటే ఆడ‌పిల్ల పుడితే నిక్క‌రూ, టీష‌ర్లూ వేసి క్రాఫ్ కూడా అలా స్ట‌యిల్‌గా చేసి ఆనందిస్తుంటారు. 

ఎవ‌రి ఆనందం వారిది.  కానీ వాంకోవ‌ర్‌లో ఓ నాలుగేళ్ల పిల్లాడు తాను గ‌ర్ల్ కాదు బాయ్‌నే అని ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. ఈమ‌ధ్య వ‌ర‌కూ ఆడ‌పిల్ల అనుకున్న‌వారంతా హ‌ఠాత్తుగా వీడు ఇలా అంటు న్నాడేవిటా అని ముక్కు వేలే సుకున్నారు. ఊరికే.. అంద‌ర్నీ ఆట‌ప‌ట్టించ‌డానికి అలా అన్నాడ‌ని ఊరు కున్నారు. కానీ వాడి అమ్మ‌మ్మ మాత్రం వాడు చెప్పేది అక్ష‌ర స‌త్యం అని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యం లో ముంచెత్తింది.

ఇంత‌కీ చాలారోజుల‌కు త‌న సంగ‌తి బ‌య‌ట‌పెట్టిన పిల్లాడి పేరు చార్లీ లాయ‌డ్‌. బ్రిటీష్ కొలంబియా, కెన‌డాలో పుట్టాడు. చార్లీ నిజానికి ఆడ‌పిల్ల‌గానే జ‌న్మించాడు. కానీ క్ర‌మేపీ మ‌గ‌పిల్ల‌వాడి ల‌క్ష‌ణాలే ప్ర‌ద‌ర్శి స్తూ వ‌చ్చాడ‌ని అత‌ని త‌ల్లి 27 ఏళ్ల అలైనా బోరెల్ అన్న‌ది. ఈ మ‌ధ్య‌నే అంద‌రితో క‌లిసి ఓ స‌మావేశంలో ధైర్యంగా లేచి గ‌ట్టిగా ప్ర‌క‌టించాడు..యామ్ నాట్ గ‌ర్ల్‌..యామ్ బాయ్‌!.. అని. అంద‌రూ గట్టిగా న‌వ్వుకున్నా రు, వాడిని కావ‌లించుకుని ముద్ద‌లు పెట్టారు. ఐస్‌క్రీమ్‌లు ఇచ్చాడు. క‌ల‌ర్ బాంబులు పేల్చారు.. అయినా వాడు మాత్రం కించిత్ క‌ద‌ల్లేదు. నిజాన్ని మీరు ఆల‌స్యంగానైనా తెలుసుకుంటారు. మీరు న‌న్ను ఆద‌రిస్తా రేన‌నుకుంటాను.. అని ప‌రుగున ఇంట్లోకి పారిపోయాడు.

చార్లీ అబ్బాయిగానే జీవితాంతం ఉండాల‌నుకున్నాడు. అధికారికంగా త‌న‌ను అలానే గుర్తించాల‌ని కోరాడ ని అత‌ని త‌ల్లి అన్న‌ది.  మ‌రి పెద్ద‌యితే?